Hyderabad: మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. నేటి నుంచే ఈ- ఆటో సేవలు.. ఎలా బుక్ చేసుకోవాలంటే..
Hyderabad Metro: నగరవాసులకు ట్రాఫిక్ నరకం నుంచి ఉపశమనం కలిగిస్తోన్న హైదరాబాద్ మెట్రో సోమవారం (ఏప్రిల్18) నుంచి మరో సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.
Hyderabad Metro: నగరవాసులకు ట్రాఫిక్ నరకం నుంచి ఉపశమనం కలిగిస్తోన్న హైదరాబాద్ మెట్రో సోమవారం (ఏప్రిల్18) నుంచి మరో సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. మెట్రో రైలు దిగగానే గమ్యస్థానానికి చేరుకునేందుకు ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఎలక్ట్రిక్ ఆటోలు(E-Auto) సేవలను ఏర్పాటుచేయనుంది. నగరంలోని మెట్రో రైలుస్టేషన్ల కేంద్రంగానే ఈ ఆటోలు నడవనున్నాయి. సోమవారం నుంచి ఈ-ఆటో సేవలు అధికారికంగా ప్రారంభంకానున్నాయి. ఈ-ఆటో కావాలనుకున్న వారు మెట్రోరైడ్ (Metro Ride) యాప్ ద్వారా ఆటోలను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. స్మార్ట్ ఫోన్ లో మెట్రోరైడ్ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రయాణానికి అనుగుణంగా ఆటోలను బుక్ చేసుకోవచ్చు.
ఇంటికి దగ్గరగా ఉండే మెట్రోరైడ్ పార్కింగ్ వద్దకు వెళితే చాలు.. ఎలక్ట్రిక్ ఆటో మిమ్మల్ని నేరుగా మెట్రో స్టేషన్‌కు తీసుకెళుతుంది. తద్వారా ఇళ్లు, ఆఫీసులు అనే కాదు స్కూళ్లు, కాలేజీలు, ఇతర ముఖ్యమైన ప్రాంతాలకు సులువుగా వెళ్లొచ్చేందుకు వీలుంటుంది. ఇక మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా మహిళా డ్రైవర్ నడిపే ఆటోలు కూడా అందుబాటులో ఉండనున్నాయి. కాగా ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరులో ఈ తరహా సేవలు విజయవంతంగా అమలవుతున్నాయి. బెంగళూరులో గతేడాది ప్రారంభించినప్పుడు మొదటి కిలోమీటరుకు రూ.10, తర్వాతి కిలోమీటరుకు రూ.5 చొప్పున వసూలు చేశారు. హైదరాబాద్‌ల ఛార్జీల విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. నేటి ప్రారంభ కార్యక్రమంలో వీటి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
Also Read:Road Accident: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కల్వర్టును ఢీకొన్న స్కార్పియో.. నలుగురి మృతి..
గోళ్లను ఈజీగా అందంగా అలంకరించుకోండి ఇలా
Multibagger Stock: రెండేళ్ల కాలంలో లక్షను.. 90 లక్షలు చేసిన మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్..