AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR: మత రాజకీయాలు చేయం.. సచివాలయంలో మసీద్, మందిర్, చర్చి.. ట్విట్టర్‌ వేదికగా కేటీఆర్ వెల్లడి

మతం ముసుగు లో రాజకీయాలు చేయమని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని మతాలను సమానంగా చూస్తున్న రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీ.రామారావు పునరుద్ఘాటించారు.

KTR: మత రాజకీయాలు చేయం.. సచివాలయంలో మసీద్, మందిర్, చర్చి.. ట్విట్టర్‌ వేదికగా కేటీఆర్ వెల్లడి
Minister KTR
Balaraju Goud
|

Updated on: Apr 18, 2022 | 6:59 AM

Share

Minister KT Ramarao: ప్రభుత్వం దృష్టిలో అన్ని మతాలు సమానమేనని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. మతసామరస్యానికి కట్టుబడి ఉన్నామన్నారు. కొత్త నిర్మిస్తున్న రాష్ట్ర సచివాలయంలో మందిరంతో పాటు మసీద్, చర్చిని నిర్మిస్తాం.. నిశ్చింతంగా ఉండండి అని ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ వెల్లడించారు. సచివాలయంలో మందిర నిర్మాణంపై ఓ నెటిజన్ ట్విట్టర్‌లో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. తాము మతం ముసుగు లో రాజకీయాలు చేయమని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని మతాలను సమానంగా చూస్తున్న రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పునరుద్ఘాటించారు.

రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో గతంలో ఉన్న మసీదు, ఆలయం, చర్చిలను పాత భవనాల కూల్చివేత సందర్భంగా తొలగించారు. వాటి స్థానంలో కొత్త నిర్మాణాలు చేపడతామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ఒక్కో ప్రార్థనా మందిరానికి 1500 చదరపు గజాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిందని మంత్రి స్పష్టం చేశారు. మరోవైపు సచివాలయ నిర్మాణ పనులు వడివడిగా సాగుతున్నాయి. వచ్చే దసరా నాటికి కొత్త సచివాలయ భవనాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని ఇంజినీర్లు, కాంట్రాక్టర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా పనులు వేగవంతం చేశారు. మొత్తం 1,250 మంది కార్మికులు సచివాలయ పనుల్లో నిమగ్నమయ్యారు. 24 గంటల పాటు మూడు షిఫ్టుల్లోనూ పనులు కొనసాగుతున్నాయి. మిగిలిన ఇతర పనులను కూడా సమాంతరంగా చేపడుతున్నారు.

అండర్‌-14 హాకీ క్రీడాకారిణులకు ఆర్థిక సాయం

అలాగే, ఇంఫాల్‌లో మే రెండో వారంలో జరిగే జాతీయ హాకీ అండర్‌-14 క్రీడా పోటీల్లో తెలంగాణ జట్టు పాల్గొనేందుకు రూ.3 లక్షలు అవసరమని, సాయం చేయాలని హాకీ క్రీడాకారిణులు మంత్రి కేటీఆర్‌కు ట్విటర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు. తప్పక సాయం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ఇదిలావుంటే, ఖమ్మంకు చెందిన వ్యక్తి నేపాల్‌లో ఆకస్మికంగా మృతి చెందారని, ఆయన మృతదేహాన్ని హైదరాబాద్‌కు పంపించే ఏర్పాట్లు చేయాలని మంత్రి కేటీఆర్‌.. ఖాట్మండూలోని భారత రాయబారిని ఫోన్‌లో కోరారు. ఖమ్మంకు చెందిన నెటిజన్‌ అఖిల్‌.. ఈ సాయం కోసం కేటీఆర్‌ను ట్విటర్‌ ద్వారా అభ్యర్థించగా ఆయన స్పందించారు.

Read Also…. KTR Warangal Tour: ఈనెల 20న వరంగల్‌కు కేటీఆర్.. హాయగ్రీవచారీ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ