AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: భార్యతో గొడవ.. గొంతు గట్టిగా పట్టి రూమ్‌లో పెట్టి డోర్ వేశాడు.. తెల్లారి వెళ్లి చూడగా..

అనుమానంతో ఓ భర్త.. తనతో 27 ఏళ్లు కాపురం చేసిన భార్యను చంపేశాడు. గొంతు నులిమి అతి కిరాతకంగా అంతమొందించాడు. ఆపై పీఎస్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన బోరబండ పరిధిలో జరిగింది. దీంతో ఇద్దరు ఉన్నత చదువులు చదువుతున్న పిల్లలు అనాథులు అయ్యారు.

Telangana: భార్యతో గొడవ.. గొంతు గట్టిగా పట్టి రూమ్‌లో పెట్టి డోర్ వేశాడు.. తెల్లారి వెళ్లి చూడగా..
Narender - Padmalatha
Lakshmi Praneetha Perugu
| Edited By: Ram Naramaneni|

Updated on: Mar 14, 2025 | 11:50 AM

Share

మహబూబ్​నగర్​జిల్లా తాటికొండ గ్రామానికి చెందిన జెట్టెం నరేందర్‌కు 27 ఏళ్ల కిందట రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లి ప్రాంతానికి చెందిన పద్మలతతో మ్యారేజ్ అయింది. దంపతులు ప్రస్తుతం నగరంలోని రహ్మత్​నగర్​పరిధిలోని రాజీవ్​గాంధీనగర్​లో నివాసం ఉంటున్నారు. వీరికి కుమార్తె సుష్మ, తనయుడు శ్రీమన్నారాయణ ఉన్నారు. కుమార్తె ఎంఎస్​కంప్లీట్ చేసి అమెరికాలో ఉంటుంది. కుమారుడు ఢిల్లీ ఐఐటీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు

నరేందర్ ఓ అనుమానపు పక్షి అని బంధువులు చెబుతున్నారు. పెళ్లైన నాటి నుంచి భార్యను అనుమానించి వేధించి.. గొడవలు పెట్టుకునేవాడు. అయినా సరే పిల్లలు కారణంగా పద్మలత ఆ బాధలు భరించింది. భర్త చేసే కిరాణ, పాల వ్యాపారంలో తన వంతు పాత్ర పోషించింది. పిల్లలు ఉన్నత స్థానంలో ఉండాలని ఆమె ఆరాటపడేదని బంధువులు చెబుతున్నారు. అయితే బుధవారం దంపతుల మధ్య ఘర్షణ చెలరేగింది. విచక్షణ కోల్పోయిన భర్త ఆమెను కొట్టాడు. దీంతో కోపంలో ఆమె బ్యాగు సర్దుకుని తన పుట్టింటికి వెళ్లేందుకు సిద్దమైంది. దీంతో నరేందర్ మరింత రెచ్చిపోయాడు. ఆమె గొంతు నులిమి… గదిలో బంధించి లాక్ చేసి.. హాల్‌లో వెళ్లి పడుకున్నాడు. తెల్లారి ఉదయాన్నే లేచి.. పాలు పోసి వచ్చాడు. ఆపై డోర్ తీసి చూడగా.. భార్యను ఎంత పిలిచినా పలకలేదు. దీంతో చనిపోయిందని నిర్ధారించుకుని బోరబండ పీఎస్‌కు వెళ్లి లొంగిపోయాడు. క్షణికావేశంలో హత్య చేసినట్లు పోలీసుల ముందుకు ఒప్పుకున్నాడు. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు డెడ్‌బాడీని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

భర్త వేధింపులు, దాడిని తట్టుకోలేని ఆమె తన అమ్మవాళ్ల ఇంటికి వెళ్లడానికి బ్యాగుతో సిద్ధమైంది. దీంతో మరింత రెచ్చిపోయిన నరేందర్ ​ఆమె గొంతు నులిమి గదిలో బంధించి తలుపులు వేసి హాల్‌లో నిద్రపోయాడు. మరునాడు ఉదయం నిద్రలేచిన నరేందర్​ ఇంటింటికి వెళ్లి పాలు వేసి వచ్చాడు. వెంటనే గదిలో ఉన్న భార్యను నిద్రలేపడానికి ప్రయత్నించగా ఆమె స్పందించలేదు. దీంతో చనిపోయిందని నిర్ధారించుకొని బోరబండ పోలీస్​ స్టేషన్​కు వెళ్లి లొంగిపోయాడు. తన భార్యను గొంతు నులిమి హత్య చేసినట్లు వారితో వాపోయాడు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

అయితే నరేందర్ భార్య గొంతు నులిమినప్పుడు ఆమె ముక్కులో నుంచి రక్తస్రావం అయి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే అప్రమత్తమై ఆస్పత్రికి తీసుకెళ్లి ఉంటే ఆమె బ్రతికేదేమో. అతడు పట్టించుకోకపోవడంతో పద్మలత మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..