AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణం.. కాళ్లు, చేతులు కట్టి ఉరేశారు!

హైదారాబాద్ శివారు ప్రాంతం బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం చెలరేగింది. ఓ వ్యక్తి కాళ్లు, చేతులు కట్టేసిన దుండగులు గేట్‌కు ఉరి వేశారు.  దేవతలగుట్ట మార్గంలో ఓ గేట్‌కు మృతదేహం వేలాడతుంది అంటూ స్థానిక పోలీసులకు సమాచారం అందింది. వెంటనే స్పాట్‌కి వెళ్లిన పోలీసులు ఆ వ్యక్తిని బాలాపూర్ ప్రాంతానికి చెందిన ప్రశాంత్‌గా గుర్తించారు. అతనికి తల్లిదండ్రులు లేకపోవడంతో, సోదరుడికి సమాచారం అందించారు. గతంలో ఆర్‌సీఐలో లేబర్‌గా పనిచేసిన ప్రశాంత్..ఇటీవల కాలంలో చెడు అలవాట్లకు బానిసయినట్టుగా […]

దారుణం.. కాళ్లు, చేతులు కట్టి ఉరేశారు!
Ram Naramaneni
|

Updated on: Jan 19, 2020 | 10:32 PM

Share

హైదారాబాద్ శివారు ప్రాంతం బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం చెలరేగింది. ఓ వ్యక్తి కాళ్లు, చేతులు కట్టేసిన దుండగులు గేట్‌కు ఉరి వేశారు.  దేవతలగుట్ట మార్గంలో ఓ గేట్‌కు మృతదేహం వేలాడతుంది అంటూ స్థానిక పోలీసులకు సమాచారం అందింది. వెంటనే స్పాట్‌కి వెళ్లిన పోలీసులు ఆ వ్యక్తిని బాలాపూర్ ప్రాంతానికి చెందిన ప్రశాంత్‌గా గుర్తించారు. అతనికి తల్లిదండ్రులు లేకపోవడంతో, సోదరుడికి సమాచారం అందించారు. గతంలో ఆర్‌సీఐలో లేబర్‌గా పనిచేసిన ప్రశాంత్..ఇటీవల కాలంలో చెడు అలవాట్లకు బానిసయినట్టుగా స్థానికుల నుంచి సమాచారం అందుతోంది. కాగా ప్రశాంత్‌కి శత్రువులు ఎవరూ లేరని అతని సోదరుడు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న బాలాపూర్ పోలీసులు విచాారణ ప్రారంభించారు.

Follow Us