AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: సైడ్‌ ఇన్‌కమ్‌ అనుకున్నారేమో.! సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు

మాదకద్రవ్యాల కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అక్రమార్కులు మాత్రం రెచ్చిపోతున్నారు. తమదైన మార్గాల్లో గంజాయిను తరలిస్తున్నారు. అయితే ఇప్పుడీ దందాలో ఏకంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే యువకులు కూడా చేరడం షాక్ కి గురి చేస్తోంది. తాజాగా హైదరాబాద్ లో గంజాయి విక్రయిస్తూ నలుగురు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు పట్టుపడ్డారు..

Hyderabad: సైడ్‌ ఇన్‌కమ్‌ అనుకున్నారేమో.! సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు
Hyderabad
Narender Vaitla
|

Updated on: Oct 19, 2024 | 7:43 AM

Share

అత్యాశ, భయం.. ఈ రెండూ మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది, ఎంతటి తప్పునైనా చేస్తుంది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం, నెల తిరక్కుండానే జీతం.. హ్యాపీగా సినిమాలు చూస్తూ, ఫ్రెండ్స్‌తో పార్టీలు చేసుకుంటూ లైఫ్‌ను ఎంజాయ్‌ చేయాల్సిన యువకులు తపపుడు దారి వెతుక్కున్నారు. వచ్చిన జీతం చాలట్లేదు అనుకున్నారో లేక సైడ్‌ ఇన్‌కమ్‌గా పనికొస్తుంది అనుకున్నారో కానీ ఓ దందాకు తెర తీశారు. అది చట్టబద్దమైనది అయితే అందరూ మెచ్చుకున్ననే వారు, కానీ హైదరాబాద్‌కు చెందిన ఈ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు చేసిన పనికి పోలీసులు కటకటాల్లోకి పంపించారు.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీకి చెందిన 4 యువకులు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ స్థానికంగా ఓ హాస్టలో ఉంటున్నారు. ఇదే సమయంలో ఉద్యోగం చేస్తూనే మాదక ద్రవ్యాలను విక్రయిస్తూ పోలీసులకు రెడ్‌ హ్యాండెండ్‌గా దొరికిపోయారు. విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఆ కుర్రాళ్లపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే మాదక ద్రవ్యాలు అమ్ముతుండగా బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

తమకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు.. ఎస్వీటీ పోలీసులు ఆ యువకులపై నిఘా పెట్టారు. సరిగ్గా మాదకద్రవ్యాలు అమ్ముతున్న సమయంలో హాస్టల్‌పై దాడి చేసి.. నలుగురు యువకులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ క్రమంలో యువకుల నుంచి 1600 గ్రాముల ఎండు గంజాయిని, 4 మొబైల్‌ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా హాస్టల్స్‌లో గంజాయి పట్టుబడడం ఇదే తొలిసారి కాదు. గతకొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్‌లో కూడా గంజాయి, డ్రగ్స్‌ కళకళం రేపింది. ఎస్సార్ నగర్‌లోని ఓ బాయ్స్ హాస్టల్‌లో సోదాలు నిర్వహించిన అధికారులు ఏంగా 12 లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోవడం అప్పట్లో సంచలనంగా మారింది. 250 గ్రాముల గంజాయి, 115 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ లభ్యం కావడం అందరినీ షాక్‌కి గురి చేసింది. ఆ సమయంలో పోలీసులు ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

క్రికెట్‎లో పాలిటిక్స్..కొత్త డ్రామాకు తెరలేపిన బంగ్లా బోర్డు
క్రికెట్‎లో పాలిటిక్స్..కొత్త డ్రామాకు తెరలేపిన బంగ్లా బోర్డు
వెంకీ, రవితేజ, నాగార్జునతో బ్లాక్ బస్టర్స్.. కానీ ఇప్పుడు
వెంకీ, రవితేజ, నాగార్జునతో బ్లాక్ బస్టర్స్.. కానీ ఇప్పుడు
భార్య పెట్టిన ఒక్క మెసేజ్‌తో భర్త ఆత్మహత్య
భార్య పెట్టిన ఒక్క మెసేజ్‌తో భర్త ఆత్మహత్య
నిరుద్యోగులకు భలే న్యూస్.. త్వరలో 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు భలే న్యూస్.. త్వరలో 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
ఫిబ్రవరి 1 తర్వాత గోల్డ్‌ లోన్‌ తీసుకుంటే ఇన్ని ప్రయోజనాలా?
ఫిబ్రవరి 1 తర్వాత గోల్డ్‌ లోన్‌ తీసుకుంటే ఇన్ని ప్రయోజనాలా?
కేవలం రూ.65 వేలకే హోండా బైక్‌.. 65కి.మీపైగా మైలేజీ..!
కేవలం రూ.65 వేలకే హోండా బైక్‌.. 65కి.మీపైగా మైలేజీ..!
9 మ్యాచ్‌లు..5 సెంచరీలు..ఎవడు మమ్మీ వీడు..మనీషా లేక రన్ మెషినా ?
9 మ్యాచ్‌లు..5 సెంచరీలు..ఎవడు మమ్మీ వీడు..మనీషా లేక రన్ మెషినా ?
కేవలం రూ.2,500కే ప్రేమ బీమా..పెళ్లి తర్వాత రూ.1.2 లక్షలు క్లెయిమ్
కేవలం రూ.2,500కే ప్రేమ బీమా..పెళ్లి తర్వాత రూ.1.2 లక్షలు క్లెయిమ్
ఎట్టకేలకు గ్రూప్ 3 ఉద్యోగాలకు మోక్షం.. నేడే నియామక పత్రాలు అందజేత
ఎట్టకేలకు గ్రూప్ 3 ఉద్యోగాలకు మోక్షం.. నేడే నియామక పత్రాలు అందజేత
డోనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ బహుమతి ఇచ్చేసిన మచాడో..!
డోనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ బహుమతి ఇచ్చేసిన మచాడో..!