Hyderabad: 15 ఏళ్ల బాలుడు ఆ సినిమాలో హీరో కాల్చినట్లు స్టైల్‌గా సిగరెట్ కాల్చాడు.. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిపాలయ్యాడు..

|

May 28, 2022 | 2:28 PM

తాజా సూపర్ హిట్ సినిమాలోని హీరోని అనుకరిస్తూ.. ఓ యువకుడు స్టైల్ గా సిగరెట్లు కాల్చాలని భావించాడు. దానిని అమల్లో చేసి.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.

Hyderabad: 15 ఏళ్ల బాలుడు ఆ సినిమాలో హీరో కాల్చినట్లు స్టైల్‌గా సిగరెట్ కాల్చాడు.. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిపాలయ్యాడు..
Hyderabad
Follow us on

Hyderabad: సమాజంపై సినిమాల ప్రభావం ఉందా.. లేక సమాజంలో జరిగే విషయాలనే సినిమాలుగా తెరకెక్కిస్తారా అన్న విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. తమకు ఇష్టమైన సినిమాల్లోని హీరోలను కొంతమంది అనుకరిస్తుంటారు. తమ అభిమాన హీరో వేసుకున్న దుస్తులు, ఫ్యాషన్ ను అనుకరించడం వంటివి చేస్తుంటారు. అయితే తాజా సూపర్ హిట్ సినిమాలోని హీరోని అనుకరిస్తూ.. ఓ యువకుడు స్టైల్ గా సిగరెట్లు కాల్చాలని భావించాడు. దానిని అమల్లో చేసి.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.

ఇటీవల రిలీజైన ఓ సూపర్ హిట్ పాత్రను చూసి, తానూ అలాగే స్టైలుగా ఉండాల‌నుకున్న ఓ 15 ఏళ్ల బాలుడు సిగ‌రెట్లు కాల్చి తీవ్రంగా అనారోగ్యం పాల‌య్యాడు.  వెంటనే ఆ బాలుడిని తల్లిదండ్రులు ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. దీంతో వైద్యులు చికిత్సనందించి సిగ‌రెట్లు కాల్చడం వ‌ల్ల వ‌చ్చే దుష్ప్రభావాల గురించి వివరించారు. ఆ బాలుడికి కౌన్సెలింగ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..

హైద‌రాబాద్‌లోని రాజేంద్రన‌గ‌ర్ ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలుడు రెండు రోజుల వ్యవ‌ధిలో ఇటీవల రిలీజైన ఓ సూపర్ హిట్ మూవీని మూడుసార్లు చూశాడు. తాను కూడా హీరో  కాల్చినట్లు స్టైల్ గా సిగరెట్ కాల్చాలనుకున్నాడు. ఒకేసారి ఏకంగా ఒక‌ ప్యాకెట్ సిగ‌రెట్లు కాల్చి, తీవ్రంగా అనారోగ్యం పాల‌య్యాడు. తొలిసారి కాల్చడంతో తీవ్రంగా అనారోగ్యం పాల‌య్యాడు. దీంతో ఆ బాలుడిని వెంట‌నే త‌ల్లిదండ్రులు ఓ ప్రయివేట్ ఆస్పత్రికి త‌ర‌లించి చికిత్సనందించారు.

ఇవి కూడా చదవండి

“యువ‌కులు హీరోలు చేసే పత్రాలను చూసి ప్రభావితుల‌వుతున్నారు. ఈ బాలుడు హీరోని చూసి ప్యాకెట్ సిగ‌రెట్లు కాల్చి తీవ్రంగా అనారోగ్యం పాల‌య్యాడు. సినిమాలు మ‌న స‌మాజం మీద తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అందువ‌ల్ల సినిమా న‌టులు, ద‌ర్శకులు త‌మ సినిమాల్లో సిగ‌రెట్లు కాల్చడం, పొగాకు న‌మ‌ల‌డం, మ‌ద్యం తాగ‌డం లాంటి దృశ్యాలు లేకుండా చూసుకోవ‌డాన్ని నైతిక బాధ్యత‌గా భావించాలని డాక్టర్ రోహిత్ రెడ్డి చెప్పారు.

తమ పిల్లల ఆలోచనలు, చర్యలపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని సూచించారు. పిల్లలు చేసిన పనులను పట్టించుకోకుండా వదిలేసి.. త‌ర్వాత కొట్టడం తిట్టడం, బాధ‌ప‌డేకంటే.. మొదటే పిల్లలకు  దుష్ప్రభావాల గురించి వివరించాలని తెలిపారు. సిగ‌రెట్లు కాల్చడం, మ‌ద్యం తాగ‌డం లాంటి చ‌ర్యల వ‌ల్ల క‌లిగే దుష్ప్రభావాల గురించి పిల్లల్లో ముందుగానే అవ‌గాహ‌న క‌ల్పించాలని తెలిపారు.

చిన్నత‌నంలో సిగ‌రెట్లు కాల్చడం వ‌ల్ల యువ‌త‌కు తీవ్రమైన అనారోగ్య స‌మస్యలు వ‌స్తాయి. వాటిలో శ్వాస‌ప‌ర‌మైన ఇబ్బందులు తీవ్రంగా రావ‌డం, ఫిట్‌నెస్ ఒక్కసారిగా త‌గ్గిపోవ‌డం, ఊపిరితిత్తుల ఎదుగుద‌ల‌, ప‌నితీరుపై దీర్ఘకాల ప్రభావం ప‌డ‌టం లాంటివి ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యంగా, ఈ వ‌య‌సులో అల‌వాటు అయితే త‌ర్వాత పెద్దయ్యే వ‌ర‌కూ కూడా అది మానుకోలేని అల‌వాటుగా మారిపోతుంది. ప్రతిరోజూ సిగ‌రెట్లు కాల్చేవారిలో 87% మంది త‌మ తొలి సిగ‌రెట్టును 18 ఏళ్ల వ‌య‌సులోపే మొదలుపెట్టి ఉంటారు. 97% మంది మాత్రం 21 ఏళ్ల వ‌య‌సులో మొద‌లు పెడుతున్నారని పలు నివేదికల ద్వారా వెల్లడైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..