ఎక్కడ ఉంటారో తెలియదు. ఎలా ఉంటారో జాడ లేదు. కానీ వాళ్లు చేసే పనికి బాధితులు బెంబేలెత్తిపోతున్నారు. కంటికి కనిపించకుండా, పోలీసులకు చిక్కకుండా వారు చేసే ఆగడాలు, నేరాలకు అడ్డే లేకుండా పోతోంది. ఎలా చేస్తారో ఏమో గానీ గుట్టు చప్పుడు కాకుండా, మనకే తెలియకుండా పర్సనల్ డీటెయిల్స్ తీసుకుంటున్నారు. వాటిని మార్ఫింగ్ చేసి బెదిరింపులకు దిగుతున్నారు. సోషల్ మీడియాను ప్రతి ఒక్కరూ విపరీతంగా యూజ్ చేస్తున్నారు. క్షణం తీరిక లేకుండా మునిగి తేలుతున్నారు. ఇదే సైబర్ నేరగాళ్ల పంట పండిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో మనం పెట్టే పోస్టులు, స్టోరీలు వాళ్లకు ఆయుధాలుగా మారుతున్నాయి. ఫొటోలు, వీడియోలు సేకరించి వాటిని మార్ఫింగ్ చేస్తున్నారు. కోరిక తీర్చాలని, డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. చేయకపోతే మార్ఫింగ్ చేసిన వాటిని ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేస్తామని బెదిరిస్తున్నారు. హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే జరిగింది.
సోషల్ మీడియాలో న్యూడ్ ఫొటోస్ పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితులు అడ్వొకేట్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫొటోలు సంపాదించిన నిందితుడు వాటిని న్యూడ్ ఫొటోస్ గా మార్చాడు. వాటి ద్వారా బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేశాడు. ఫొటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బెదిరించాడు. దీంతో ఏ చేయాలో తెలియక బాధితులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఐసీ అడ్రస్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్న వ్యక్తి దిల్ సుఖ్ నగర్ కు చెందిన అశోక్ గా గుర్తించారు. అతనిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం