Hyderabad: ఆరుగురు గోల్డ్ షాపు లోపలకి వెళ్లగానే ఏం చేశారో తెలుసా.. కంప్లీట్ సీసీ టీవీ వీడియో

హైదరాబాద్‌ చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీలో ఆరుగురు దుండగులు సినిమా స్టైల్‌లో దోపిడి చేశారు. ముగ్గురు స్టాఫ్‌ను హాస్టేజ్‌గా ఉంచగా.. మిగతా ముగ్గురు డిస్ ప్లేలో ఉన్న బంగారు ఆభరణాల గ్లాస్‌ను చేత్తోనే పగలగొట్టి.. మూడు బ్యాగుల్లో నింపుకుని పారిపోయారు. లోపల వారి లూటీకి సంబంధించిన వీడియో తాజాగా బయటకొచ్చింది.

Hyderabad: ఆరుగురు గోల్డ్ షాపు లోపలకి వెళ్లగానే ఏం చేశారో తెలుసా.. కంప్లీట్ సీసీ టీవీ వీడియో
Gold Heist

Updated on: Aug 12, 2025 | 4:41 PM

హైదరాబాద్‌ నగరంలోని చందానగర్ ప్రాంతం. జనాల రద్దీ ఎక్కువగా ఉండే ఈ ఏరియాలో మంగళవారం చోటుచేసుకున్న ఘోర దోపిడి సంచలనం రేపింది. ఖజానా జ్యువెలరీ షోరూం లక్ష్యంగా ఆరుగురు దుండగులు పక్కా ప్లాన్‌తో దాడి చేశారు. లోపలకి ప్రవేశించిన వెంటనే ముగ్గురు నిందితులు కత్తులు, తుపాకీలతో బెదిరించి స్టాఫ్ మొత్తాన్ని ఒక చోట కూర్చోబెట్టారు. మిగతా ముగ్గురు నిందితులు షోరూం డిస్‌ప్లే కౌంటర్ల వద్దకు దూసుకెళ్లి.. అందులో ఉంచిన బంగారు ఆభరణాలపై సంచుల్లో వేశారు. సిబ్బంది అడ్డుకునే యత్నం చేయగా.. రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో డిప్యూటీ మేనేజర్‌ కాలికి గాయాలయ్యాయి. గ్లాస్ షోకేసులను పగలగొట్టేందుకు ప్రత్యేక పరికరాలు ఏం వాడకుండా.. చేత్తోనే బలంగా కొట్టి పగలగొట్టారు. ఈ సమయంలో ఒక నిందితుడి చేతికి గాయమై రక్తం కారింది. అయినా అతడు ఆగకుండా మిగిలిన ఆభరణాలను సర్దేసి బ్యాగులో వేసేశాడు. మొత్తం మూడు భారీ బ్యాగుల్లో బంగారు ఆభరణాలను నింపారు. దాదాపు పది నిమిషాల వ్యవధిలోనే లూటీని ముగించి, స్టాఫ్‌ను హాస్టేజ్‌గా ఉంచిన పరిస్థితిలోనే నిందితులు బయటకు వెళ్లిపోయారు.

సమాచారం అందుకున్న వెంటనే చందానగర్ పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని షోరూం‌ను సీజ్ చేశారు. సీసీటీవీ ఫుటేజీలు స్వాధీనం చేసుకొని నిందితుల కదలికలను ట్రాక్ చేస్తున్నారు. షోరూం లోపల, బయట ఉన్న కెమెరా ఫుటేజీలను పరిశీలించి దుండగుల గుర్తింపుపై ఫోకస్ పెట్టారు. నిందితులను పట్టుకునేందుకు 10 బృందాలు రంగంలోకి దిగాయి. నిందితులు షోరూం లేఅవుట్‌ను ముందుగానే రివ్యూ చేసి.. దోపిడికి వచ్చినట్లు అనుమానిస్తున్నారు.

వీడియో దిగువన చూడండి…