AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: భాగ్యనగరంలో పార్కింగ్ కష్టాలకు చెక్.. దేశంలోనే తొలిఆటోమేటెడ్‌ పార్కింగ్‌ రెడీ..!

భాగ్యనగరంలో పార్కింగ్ కష్టాలకు చెక్.. మీరు వింటుంది నిజమే..! మహానగరం నడిబొడ్డున ఉన్న నాంపల్లిలో పార్కింగ్ కోసం ఇక మీదట ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో అత్యాధునిక మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ అందుబాటులోకి రాబోతుంది. దీంతో సెంట్రల్ సిటీలో పార్కింగ్ కష్టాలకు పులిస్టాప్ పడ్డట్టే..! ఇంతకీ ఏంటి ఆ మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్? అక్కడ ఎన్ని కార్లు పార్కింగ్ చేసుకోవచ్చు?

Hyderabad: భాగ్యనగరంలో పార్కింగ్ కష్టాలకు చెక్.. దేశంలోనే తొలిఆటోమేటెడ్‌ పార్కింగ్‌ రెడీ..!
Multi Level Automated Parking Complex In Hyderabad
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Aug 12, 2025 | 4:45 PM

Share

భాగ్యనగరంలో పార్కింగ్ కష్టాలకు చెక్.. మీరు వింటుంది నిజమే..! మహానగరం నడిబొడ్డున ఉన్న నాంపల్లిలో పార్కింగ్ కోసం ఇక మీదట ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో అత్యాధునిక మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ అందుబాటులోకి రాబోతుంది. దీంతో సెంట్రల్ సిటీలో పార్కింగ్ కష్టాలకు పులిస్టాప్ పడ్డట్టే..! ఇంతకీ ఏంటి ఆ మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్? అక్కడ ఎన్ని కార్లు పార్కింగ్ చేసుకోవచ్చు? ఇందులో కొత్తదనం ఏముంది? తెలుసుకుందాం.

హైదరాబాద్ మహానగర వాసులను నిత్యం వేధిస్తున్న వాహనాల పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి ఆటోమేటెడ్, కంప్యూటరైజ్డ్ మల్టీ లెవల్ కార్ పార్కింగ్ కాంప్లెక్స్‌కు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పనులు దాదాపు పూర్తి అయ్యాయి. నాంపల్లి మెట్రో స్టేషన్ సమీపంలో పబ్లిక్ అండ్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అయినా ఎట్టకేలకు పూర్తి అయింది.

మహానగర వాసులను వేధిస్తున్న పార్కింగ్ సమస్యను అధిగమించేందుకు నాంపల్లి మెట్రో రైల్ స్టేషన్ సమీపంలో ఉన్న హెచ్ఎంఆర్‌కు చెందిన అర ఎకరం స్థలంలో 15 అంతస్తులలో ఈ కాంప్లెక్స్ నిర్మాణం జరిగింది. ఇందులో 10 అంతస్తుల్లో వాహనాల పార్కింగ్ సౌకర్యం.. మరో ఐదు అంతస్తుల్లో కమర్షియల్ షాపులు, రెండు స్క్రీన్‌లతో కూడిన థియేటర్ కూడా నిర్మించారు. పబ్లిక్, ప్రైవేట్ విధానంలో దాదాపు రూ. 100కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టుని నిర్మాణం జరిగింది. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలోనే తొలిసారిగా జర్మన్ పాలిస్ పార్కింగ్ విధానంలో, తక్కువ స్థలంలో ఎక్కువ వాహనాలు పార్కింగ్ చేసేలా ఈ ప్రాజెక్టును చేపట్టినట్టు మెట్రో ఎండీ NVS రెడ్డి వివరించారు.

ఈ కాంప్లెక్స్‌లో మొత్తం 15 అంతస్తులు ఉంటాయి. ఇందులో 3 బేస్‌మెంట్లు, 7 పైఅంతస్తులు కలిపి మొత్తం 10 అంతస్తుల్లో పార్కింగ్‌ సదుపాయం ఉంటుంది. మరో 5 అంతస్తులను కమర్షియల్ పర్పస్ కేటాయించారు. ఈ పార్కింగ్‌ కాంప్లెక్స్‌లో అన్ని రకాల సదుపాయాలు కలిగిన రెండు సినీ థియేటర్‌లను కూడా ఏర్పాటు చేశారు. 11వ అంతస్తులో నగర వీక్షణ కోసం గ్యాలరీని ఏర్పాటు చేశారు. మొత్తం 10 పార్కింగ్‌ అంతస్తుల్లో 200 పైగా కార్లు, 200 వరకు టూ వీలర్ పార్కింగ్‌ చేయవచ్చని, ఈ ప్రాజెక్టు ద్వారా నగర ప్రజలకు ప్రపంచ స్థాయి పార్కింగ్‌ అనుభవం అందించనున్నామని అధికారులు అంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా