Hyderabad: ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్య్కూ ఆపరేషన్ సక్సెస్‌ వెనక హైదరాబాదీల కృషి.. సర్వత్రా ప్రశంసలు

| Edited By: Ram Naramaneni

Nov 29, 2023 | 3:25 PM

దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన సంఘటన సంతోషాన్నిచ్చింది. ఉత్తరాఖండ్ సిల్ క్యారా టెనల్ లో చిక్కుకున్న 41 మంది కార్మికులను సురక్షితంగా బయటపడ్డారు. ఈ రెస్క్యూ టీం వెనకాల హైదరాబాద్ చెందిన సంస్థ ప్రముఖ పాత్ర ఉంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం...

Hyderabad: ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్య్కూ ఆపరేషన్ సక్సెస్‌ వెనక హైదరాబాదీల కృషి.. సర్వత్రా ప్రశంసలు
Uttarkashi Tunnel Rescue
Follow us on

దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన సంఘటన సంతోషాన్నిచ్చింది. ఉత్తరాఖండ్ సిల్ క్యారా టెనల్ లో చిక్కుకున్న 41 మంది కార్మికులను సురక్షితంగా బయటపడ్డారు. ఈ రెస్క్యూ టీం వెనకాల హైదరాబాద్ చెందిన సంస్థ ప్రముఖ పాత్ర ఉంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం…

దేశంలోని కోట్లాదిమంది ప్రార్థనలను ఆ దేవుడు విన్నట్టున్నాడు. ఉత్తరాఖండ్ సిల్ క్యారా టెన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయింది. టెన్నెల్ లో చిక్కుకున్న 41 మంది కార్మికులు పురుషతంగా బయటకు తెచ్చింది రెస్క్యూ టీం. 17 రోజులపాటు నిరంతరంగా జరిగిన ఈ రెస్క్యూ ఆపరేషన్ లో హైదరాబాద్ కు చెందిన ఇంజనీరింగ్ సంస్థ ప్రముఖ పాత్ర పోషించింది. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి మెటల్ ఇంజనీరింగ్ లో ప్రొఫెషనల్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో టెక్నాలజీని అందిపుచ్చుకొని పొట్టి శ్రీరాములు జిల్లా తడ ప్రాంతంలో శ్రీ సిటీలో తన సంస్థ బోరాలెక్స్ ను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు. నవంబర్ 25న డి.ఆర్.డి.ఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి నుంచి శ్రీనివాస్ రెడ్డికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఉత్తరాఖండ్ ప్రమాదానికి సంబంధించి రిస్కీ ఆపరేషన్లు మీ సహాయ సహకారాలు కోరుతున్నామని అని చెప్పారు. వెంటనే శ్రీనివాసరెడ్డి స్పందించి తన సిబ్బందిని మాట్లాడు కేవలం మూడు గంటల్లోనే దానికి అవసరమైన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. ప్లాస్మా టెక్నాలజీ ద్వారా ఈ ఆపరేషన్ చేయాలని నిర్ధారించుకున్న శ్రీనివాస్ రెడ్డి వెంటనే తన టీం ను సిద్ధం చేశారు.

ఇవి కూడా చదవండి

మా ప్రాణాలు పణంగా పెట్టి..

నైపుణ్యం కలిగిన టెక్నీషియన్ కావాలని వెతుకుతున్న శ్రీనివాస్ రెడ్డికి ఇద్దరూ టెక్నీషియన్స్ తో పాటు వారికి గైడ్ చేయడానికి మరొక వ్యక్తిని ఎంచుకున్నారు ఆయనే సంతోష్ కుమార్. నాచారం దగ్గరలోని మల్లాపూర్ లో బిల్డింగ్ మిషన్స్ తయారీలో నైపుణ్యం కలిగిన సంతోష్ కుమార్ తో పాటు ఎలక్ట్రిషన్ నాగరాజు, అజయ్ షా ను తన వెంట తీసుకెళ్లారు. అక్కడ జరిగిన రిస్కు ఆపరేషన్ గురించి మాట్లాడుతూ ఆ దేవుడు ఇలాంటి అవకాశం ఇచ్చాడని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకొని ముందుకు పోయామని చెప్పారు.

ఇక ఉత్తరాఖండ్ డ్రెస్ కి ఆపరేషన్ గురించి మాట్లాడుతూ ఎలక్ట్రిషన్ నాగరాజు వెల్డింగ్ ఆపరేటర్ అజేషా తమ ఆనందాన్ని పంచుకున్నారు. తమ జీవితంలో ఇలాంటి సంఘటన ఎదురవుతుందని ఎప్పుడూ అనుకోలేదని మా ప్రాణాలు పణంగా పెట్టి అయినా గాని 41 మంది ప్రాణాలు కాపాడడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అంటున్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరాఖండ్ డ్రెస్ కి ఆపరేషన్ సక్సెస్ అవ్వడంతో దేశ ప్రధానితో పాటు ఎందరో హైదరాబాద్ చెందిన బోరోలెక్స్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..