AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉలిక్కిపడిన హైదరాబాద్.. ఆర్మీ ఫైరింగ్‌ క్యాంప్‌ దగ్గర 160 డిటోనేటర్ల కలకలం.. భారీ కుట్ర..?

హైదరాబాద్ పరిధిలోని బొల్లారం మద్రాస్ రెజిమెంట్ సమీపంలో 160 డిటోనేటర్లు లభ్యమవడం కలకలం రేపింది. ఫైరింగ్ క్యాంప్ దగ్గర బకెట్‌లో 8 బండిల్స్‌గా డిటోనేటర్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల జరిగిన ఆయుధాల మిస్సింగ్ కేసు దర్యాప్తులో భాగంగా తనిఖీలు చేస్తుండగా ఇవి బయటపడినట్లు సమాచారం. బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ఉలిక్కిపడిన హైదరాబాద్.. ఆర్మీ ఫైరింగ్‌ క్యాంప్‌ దగ్గర 160 డిటోనేటర్ల కలకలం.. భారీ కుట్ర..?
Madras Regiment
Shaik Madar Saheb
|

Updated on: Sep 03, 2026 | 9:25 AM

Share

హైదరాబాద్ పరిధిలోని బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.. ఆర్మీ కంటోన్మెంట్ పరిసరాల్లోని ఫైరింగ్‌ క్యాంప్‌ దగ్గర 160 డిటోనేటర్లు లభ్యమయ్యాయి.. బకెట్‌లో దుండగులు డిటోనేటర్లను అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. బకెట్‌లో 8 బండిల్స్‌ డిటోనేటర్లు లభ్యమయ్యాయి.. ఒక్కో బండిల్‌లో 20 డిటోనేటర్ల గుర్తించారు. ఆయుధాలు మిస్సింగ్‌ కేసులో తనిఖీలు చేస్తుండగా డిటోనేటర్ల వ్యవహారం బయటపడింది. బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేసిన పోలీసులు.. ఆ ప్రాంతంలోని అన్ని పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బొల్లారం పీఎస్‌లో కేసు నమోదు చేసి… డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా.. ఇటీవలనే ఏకే 47 తుపాకులు సహా.. పలు పిస్టోళ్ల చోరీ కలకలం రేపిన విషయం తెలిసిందే.. ఈ కేసు దర్యాప్తు చేస్తుండగా.. డిటోనేటర్లు లభ్యమవ్వడం సంచలనంగా మారింది. దుండగలు ఏదో భారీ కుట్రకు తెరలేపినట్లు సమాచారం.. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.. డిటోనేటర్లు ఎందుకు అక్కడ ఉంచారు, వాటి వెనుక ఎవరున్నారు, ఏదైనా కుట్ర ఉందా అనే అంశాలపై.. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

హైఅలర్ట్..

ఆయుధాల అపహరణ, డిటోనేటర్ల కలకలంతో మల్కాజిగిరి జోన్‌లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మద్రాస్ రెజిమెంట్ పరిసరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. డిటోనేటర్ల లభ్యంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. పలు ప్రాంతాల్లో పోలీసుల మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. జవహర్‌నగర్‌లో CRPF ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. అంతేకాకుండా.. అనుమానాస్పద వస్తువులు, ప్రాంతాలపై పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.

ఆర్మరీ తాళాలు బద్దలు కొట్టి..

బొల్లారంలోని మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీతో రక్షణ శాఖలో కలకలం రేగుతోంది. ఆర్మరీ తాళాలు బద్దలు కొట్టి ఏకంగా 12 అత్యాధునిక తుపాకులు, 21 మ్యాగజైన్లు, 1,912 తూటాలు, నైట్‌ విజన్‌ బైనాక్యులర్‌ మాయం కావడం తీవ్ర సంచలనంగా మారింది. ఆగస్టు 30 సాయంత్రం నుంచి 31 ఉదయం మధ్య చోరీ జరిగినట్లు గుర్తించారు అధికారులు. ఇప్పటికే మిలటరీ ఇంటెలిజెన్స్‌, పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ చోరీపై పోలీసులకు ఆర్మీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదులో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆగస్టు 30 సాయంత్రం 6 గంటలకు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని చివరిసారిగా లెక్కించారు. ఆ తర్వాత ఆగస్టు 31 ఉదయం 7 గంటల 50 నిమిషాలకు ఆర్మరీ తెరిచినప్పుడు తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు.

Follow Us