AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్ రిమ్స్‌.. అన్నీ అనుమానాలే.. ఐదుకు చేరిన మృతుల సంఖ్య..

ఆదిలాబాద్‌ రిమ్స్‌లోని ఎస్‌ఎన్‌సీయూలో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తాజా నివేదికల ప్రకారం.. మొత్తం ఐదుగురు నవజాత శిశువులు మృతి చెందగా, మరికొందరు చికిత్స పొందుతున్నారు. ఏసీ యూనిట్‌లో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటనపై ప్రభుత్వం నిపుణుల కమిటీతో విచారణకు ఆదేశించడంతో పాటు ఫైర్, ఎలక్ట్రికల్, స్ట్రక్చరల్ సేఫ్టీ ఆడిట్‌ నిర్వహించనుంది.

బాబోయ్ రిమ్స్‌.. అన్నీ అనుమానాలే.. ఐదుకు చేరిన మృతుల సంఖ్య..
Adilabad Rims Fire Accident
Shaik Madar Saheb
|

Updated on: Sep 23, 2026 | 9:51 AM

Share

బాబోయ్ రిమ్స్‌.. ఇక్కడకు వెళ్తే ఆరోగ్యం బాగు చేసుకోవడం ఏమో గాని క్షేమంగా తిరిగొస్తామన్న భరోసా లేదా? సోమవారం నాటి ఘటన ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. అర్ధరాత్రి అగ్ని ప్రమాదం.. పూర్తి కళ్లు తెరవకుండానే శాశ్వతంగా కన్నుమూశారు పసికందులు.. ఓ వైపు నిర్లక్షం.. మరో వైపు తిష్టవేసిన సమస్యలు .. వెరిసి ఐదుగురి ప్రాణాలను బలిగొన్నాయి.. కన్నతల్లులకు కడుపుకోత మిగిల్చాయి. ఇంకా ఒక్కరిద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. అర్థరాత్రి ఏసీ పేలి నిన్న ఉదయం ముగ్గురు పసికందులు మృతిచెందారు. హైదరాబాద్ నిలోపర్ తరలిస్తుండగా మరో ఇద్దరు మృతి చెందారు. మృతుల సంఖ్య బయటకు తెలియకుండా రిమ్స్ యాజమాన్యం గోప్యంగా ఉంచడం చర్చనీయాంశంగా మారింది. సోమవారం అర్ధరాత్రి రిమ్స్‌లో అగ్ని ప్రమాదం జరగగా.. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ పేలినట్టు అధికారులు గుర్తించారు.

రిమ్స్ ఆసుపత్రి ఎస్.ఎన్.సీ.యూలో సోమవారం అర్ధరాత్రి ప్రమాదం ఘటన పై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రిమ్స్ ఘటనపై విచారణ కమిటి. ప్రమాదం చోటు చేసుకున్న ఎస్.ఎన్.సీ.యూ గదులను సీజ్ చేసి అంతర్గత విచారణ చేపట్టారు..

కాగా.. ప్రమాదంలో అన్నీ అనుమానాలే నెలకొన్నాయి.. స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్ -SNCUలో అలంకార ప్రాయంగా అగ్నిమాపక పరికరాలు ఉండటం సంచలనంగా మారింది. విద్యుత్ వైరింగ్ లో లోపాలున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. ఏసీ యూనిట్ నిర్వహణలోనూ లోపాలున్నట్టు పేర్కొంటున్నారు. రిమ్స్ లో ఫైర్ సేప్టీ ఆడిట్ కూడా లేదు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం-CEA ప్రకారం ఏడాదికి రెండుసార్లు ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాల్సి ఉన్నా.. ఫైర్ సేప్టీ ఆడిట్ జరగలేదని సిబ్బంది పేర్కొంటున్నారు.

స్పెషల్ నియోనాటల్ కేర్ యూనిట్ విభాగంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో ఫైర్ సిలిండర్ పనిచేయలేదు. దీంతో ఇన్, అవుట్ బోర్న్ గదుల అద్దాలను వైద్య సిబ్బంది, సెక్యూరిటీ గార్డ్స్ పగల గొట్టారు. దీంతో కొంతమంది ప్రాణాలు దక్కాయని పేర్కొంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us