Trending Song: ఏం పాట రా బాబూ.. 27 ఏళ్లుగా యూట్యూబ్‌ను ఊపేస్తున్న బాలకృష్ణ సాంగ్.. మణిశర్మ మ్యూజిక్ వేరేలెవల్..
ప్రస్తుతం ఫోక్ సాంగ్స్ యూట్యూబ్, డిజిటల్ ప్రపంచంలో సత్తా చాటుతున్నాయి. అలాగే ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ సైతం దశాబ్దాలుగా యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ పాట కూడా ఒకటి. బాలకృష్ణ నటించిన ఈ పాటకు ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గడం లేదు. ఇంతకీ ఆ సాంగ్ ఏంటో తెలుసుకుందమా.

నందమూరి బాలకృష్ణ నటించిన ఎవర్ గ్రీన్ కల్ట్ క్లాసిక్ సినిమాల్లో ‘సమరసింహారెడ్డి’ ఒకటి. డైరెక్టర్ బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించి, ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇందులో బాలకృష్ణ సరసన అంజలి ఝవేరి కథానాయికగా నటించింది. ఈ సినిమాలోని ప్రతీ పాట ఒక సంచలనమే. ఇప్పటికీ ఈ సినిమాలోని ప్రతీ సాంగ్ యూట్యూబ్ లో దుమ్మురేపుతుంటాయి. అప్పటి యువతే కాదు ఇప్పుడు జెన్ జీ సైతం ఈ సినిమాలోని పాటలను ఎంజాయ్ చేస్తుంటారు. ఇక ఈ చిత్రంలోనే పాటలన్నీ సూపర్ హిట్ కాగా.. “అందాల ఆటబొమ్మ” పాట ఇప్పటికీ సంగీత ప్రియులను ఊపేస్తోంది. విడుదలైన దశాబ్దాలు గడుస్తున్నా, ఈ పాట క్రేజ్ కొంచెం కూడా తగ్గకపోవడం గమనార్హం. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన అద్భుతమైన స్వరాలు ఈ పాటకు ప్రాణం పోశాయి. ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్, సుజాత గాత్రం ఈ పాటలోని భావాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లాయి. సిమ్రన్ , బాలకృష్ణ జోడీ తెరపై అందించిన గ్రాండ్ విజువల్స్, డ్యాన్స్ మూమెంట్స్ నందమూరి అభిమానులను, సగటు సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మ్యూజిక్ ప్రియుల ప్లేలిస్ట్‌లో ఈ పాట నిరంతరం మార్మోగుతూనే ఉంది.
ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా లవ్ స్టోరీ.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. తెలుగులో పెద్ద డిజాస్టర్..
సినిమా విడుదలై దాదాపు 27 ఏళ్లు కావస్తున్నా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ పాట హవా కొనసాగుతూనే ఉంది. ఈ బ్లాక్‌బస్టర్ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో నేటికీ దూసుకుపోతోంది. ఎవర్ గ్రీన్ క్లాసిక్ సాంగ్స్‌ను ఇష్టపడేవారు, నేటితరం సంగీత అభిమానులు సైతం ఈ మెలోడీకి ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్స్ రూపంలోనూ ఈ పాట ఇప్పటికీ ట్రెండింగ్‌లో నిలుస్తుండటం బాలయ్య సాంగ్స్‌కున్న విపరీతమైన ఆదరణకు నిదర్శనం.
ఎక్కువ మంది చదివినవి : Folk Song: అబ్బబ్బ ఏమున్నది పాట.. డీజేలో మోత మోగిపోతుందిగా.. వింటే స్టెప్పేయాల్సిందే..
మొత్తానికి కాలం మారుతున్నా, కొత్త కొత్త సంగీత తరంగాలు వస్తున్నా, బాలకృష్ణ ‘సమరసింహారెడ్డి’లోని “అందాల ఆటబొమ్మ” పాట అందించే అనుభూతి మాత్రం చెక్కుచెదరలేదు. ప్రస్తుతం ఈ సినిమాలోని పాటలను కుర్రాళ్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..
అందాల ఆడబొమ్మ సాంగ్..
ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..
