AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కంటి మసక తగ్గాలంటే ఇవే పర్ఫెక్ట్.. ఎంత ఖర్చు అయినా కొని తెచ్చుకోండి..

ఈ గింజలు కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. డయాబెటిక్ రెటినోపతి, అధిక రక్తపోటు వల్ల కలిగే కంటి డ్యామేజ్, వయసుతో పాటు వచ్చే చూపు మందగించడం వంటి సమస్యలకు ఇవి అద్భుతమైన పరిష్కారం. కంటి రక్షణకు, చూపును మెరుగుపరచడానికి ఈ గింజలు శాస్త్రీయంగా నిరూపించారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

Prasanna Yadla
|

Updated on: Sep 23, 2026 | 10:33 AM

Share
ఆరోగ్యకరమైన జీవనశైలికి ఉప్పు లేని ఆహారం ప్రధానమైనది. శరీరానికి అవసరమైన సోడియం గురించి నిపుణులు చెబుతూ.. రోజుకు 300-400 మిల్లీగ్రాముల సోడియం సరిపోతుందని, ఇది సహజంగానే అన్ని ఆహార పదార్థాలలో లభిస్తుందని నొక్కి చెప్పారు. మనం సాధారణంగా రుచి కోసం టేబుల్ సాల్ట్ తో 5,000 నుండి 10,000 మిల్లీగ్రాముల సోడియంను తీసుకుంటున్నామని, ఇది అనవసరం, అనారోగ్యకరమని చెబుతున్నారు.

1 / 5

సహజసిద్ధమైన ఆహారంలో సోడియం లేని పదార్థం నేచర్‌లో లభించదని, 84 లక్షల జీవరాశులకు కూడా సహజ ఆహారం వలనే సోడియం లభిస్తుందని చెబుతున్నారు. అయితే, మీరు ఉప్పును పూర్తిగా మానేసినప్పుడు, కొందరికి సోడియం స్థాయిలు తగ్గడం (135 మిల్లీగ్రాముల కంటే తక్కువ) మంచిది కాదని, అలాంటి సందర్భాలలో సహజ సోడియంను తిరిగి శరీరానికి అందించే మార్గాలను వెతకాలని చెబుతున్నారు.

2 / 5
ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారం  "అన్నాట్టో  సీడ్స్" . ఇది అధిక సోడియం కలిగిన, నెంబర్ వన్ సీడ్. అన్నాట్టో గింజల్లో 100 గ్రాములకు 2,240 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. ఇతర ఆహార పదార్థాలతో పోలిస్తే దీని సోడియం కంటెంట్ చాలా ఎక్కువ. సాధారణ కూరగాయలు, ఆకుకూరల్లో 25-80 మిల్లీగ్రాముల సోడియం లభిస్తే, కర్బూజా పండు, కొబ్బరి నీళ్ళలో 105 మిల్లీగ్రాములు ఉంటాయి. అత్యధిక సోడియం కలిగిన ఆకుకూర అయిన తోటకూరలో 230 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. అన్నాట్టో సీడ్స్  సోడియం కంటెంట్ తోటకూర కంటే పది రెట్లు, కొబ్బరి నీళ్ల కంటే ఇరవై రెట్లు అధికం.

3 / 5

అన్నాట్టో గింజలను ఆహారంలో చేర్చుకోవడానికి వివిధ మార్గాలున్నాయి. వీటిని నానబెట్టి పేస్ట్ చేసి వంటలలో ఉపయోగించుకోవచ్చు. రోజుకు 20-30 గ్రాముల పేస్ట్ తీసుకున్నప్పటికీ శరీరానికి అవసరమైన సోడియం లభిస్తుంది. అలాగే, వీటిని వేపించి పొడి చేసి సలాడ్‌లు, మొలకలు, పండ్లపై చల్లుకుని తినవచ్చు. కొన్నిసార్లు, అన్నాట్టో గింజలను నానబెట్టి, గ్రైండ్ చేసి, పాలుగా తీసి, ఆ పాలను వంటలలో కూడా ఉపయోగించవచ్చు. ఈ గింజలు తీపి, ఘాటు రుచిని కలిగి ఉంటాయి. సాధారణంగా వీటిని నాచురల్ కలరింగ్ సోర్స్‌గా (పసుపు, కుంకుమపువ్వు లాగా పసుపు, నారింజ, ఎరుపు రంగుల కోసం) ఉపయోగిస్తారు.

4 / 5
అన్నాట్టో గింజల ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాల్లో ఒకటి కంటిచూపు మెరుగుదల. డయాబెటిక్ రెటినోపతి, అధిక రక్తపోటు వల్ల కంటి రెటీనాకు కలిగే నష్టం, వయసుతో పాటు వచ్చే చూపు మందగించడం వంటి సమస్యలకు ఇది ఎంతో ప్రయోజనకరమని శాస్త్రీయంగా నిరూపించబడింది. కంటి రక్షణకు, అంధత్వం రాకుండా కాపాడటానికి ఈ గింజలు అద్భుతంగా పనిచేస్తాయని దేశ విదేశాలలో పరిశోధనలు రుజువు చేశాయి.

5 / 5
Follow Us