AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Revanth Reddy : హీరో నాని స్పెషల్ రిక్వెస్ట్.. స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి..

టాలీవుడ్ హీరో నాని విజ్ఞప్తిపై తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ఉన్న థియేటర్‌లో అభిమానులతో కలిసి ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రీమియర్ షో చూసేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని నాని రిక్వెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం ఎక్స్‌ వేదికగా స్పందించారు. భద్రతా మార్గదర్శకాలను పాటించడంపై నానికి ఉన్న నిబద్ధతను అభినందించారు.

CM Revanth Reddy : హీరో నాని స్పెషల్ రిక్వెస్ట్.. స్పందించిన  తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి..
CM Revanth Reddy Responds To Actor Nani
Rajitha Chanti
|

Updated on: Sep 23, 2026 | 10:23 AM

Share

టాలీవుడ్ హీరో నాని విజ్ఞప్తిపై తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ఉన్న థియేటర్‌లో అభిమానులతో కలిసి ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రీమియర్ షో చూసేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని నాని రిక్వెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం ఎక్స్‌ వేదికగా స్పందించారు. భద్రతా మార్గదర్శకాలను పాటించడంపై నానికి ఉన్న నిబద్ధతను అభినందించారు. “భద్రతా మార్గదర్శకాల పట్ల మీరు చూపిస్తున్న గౌరవానికి, అలాగే తెలంగాణకు చెందిన ప్రతిభావంతులైన యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం పట్ల మీకున్న అంకితభావానికి మేము అభినందనలు తెలియజేస్తున్నాము. జనసందోహాన్ని సజావుగా నిర్వహించడానికి, ప్రజల భద్రతను నిర్ధారించడానికి, దయచేసి సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్‌లో అధికారిక దరఖాస్తును సమర్పించండి. సంబంధిత బృందం ఆ దరఖాస్తును పరిశీలించి, తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటుంది” అంటూ రిప్లై ఇచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా లవ్ స్టోరీ.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. తెలుగులో పెద్ద డిజాస్టర్..

న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటేస్ట్ మూవీ ది ప్యారడైజ్. సెప్టెంబర్ 24న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అడియన్స్ ముందుకు రానుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సినిమా విడుదలకు ఒకరోజు ముందుగానే అంటే సెప్టెంబర్ 23న రాత్రి ప్రీమియర్ షోలు నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ప్రీమియర్ షోలకు ఏర్పాటు జరుగుతున్న సమంయలోనే అభిమానులతో కలిసి తాను సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేశారు నాని. అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పోలీస్ శాఖ అధికారులను కోరారు. తాజాగా ఈ విషయంపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: అబ్బబ్బ ఏమున్నది పాట.. డీజేలో మోత మోగిపోతుందిగా.. వింటే స్టెప్పేయాల్సిందే..

ది ప్యారడైజ్ సినిమా విషయానికి వస్తే.. దసరా తర్వాత నాని, శ్రీకాంత్ కాంబోలో వస్తున్న సినిమా ఇది. దీంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఆయా షేర్, ఏషనాగుల కట్టమీద పాటలు యూట్యూబ్ లో దుమ్మురేపుతున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్..

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

Follow Us