AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మీటర్ రీడింగ్ ఎంత లోపల ఉంటే పోలీసులు వదిలేస్తారు..?

ఈ మధ్య హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు తెగ నమోదు అవుతున్నాయి. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా కొందరు మాట వినడం లేదు. లైసెన్సులు రద్దు చేసినా దారిలోకి రావడం లేదు. దీంతో ఇంకాస్త కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తోంది.

Hyderabad: మీటర్ రీడింగ్ ఎంత లోపల ఉంటే పోలీసులు వదిలేస్తారు..?
Drunk Driving
Ram Naramaneni
|

Updated on: May 12, 2025 | 11:15 AM

Share

సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ డ్రైవర్లకు చెక్ పెట్టేందుకు ప్రతి వారాంతంతో ఉధృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మద్యం తాగి దొరికితే కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు కోర్టుల్లో ఫైన్లు వేయిస్తున్నారు. అదే పనిగా తాగి దొరికేవారిని జైలుకు కూడా పంపుతున్నారు. కొందరు జడ్జిలు వారిని సామాజిక కార్యక్రమాల్లో భాగం అవ్వాలని వినూత్న శిక్షలు వేస్తున్నారు. తాజాగా సైబరాబాద్ పోలీసులు చేసిన వారంతపు డ్రైవ్‌లో  272 మంది వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. మద్యం సేవించి ద్విచక్ర వాహనాలు నడుపుతూ 189 మంది, త్రిచక్ర వాహన డ్రైవర్లు 12 మంది… 66 మంది నాలుగు చక్రాల వాహన డ్రైవర్లు,  ఐదుగురు భారీ వాహన ఆపరేటర్లు పోలీసులకు చిక్కారు.

మియాపూర్‌లో అత్యధికంగా 50 కేసులు నమోదయ్యాయి. శంషాబాద్‌లో రెండవ స్థానంలో ఉంది. అక్క 43 మంది తాగి నడుపుతూ పోలీసులకు చిక్కారు.  షాద్‌నగర్, చేవెళ్లలో 32 కేసులు చొప్పున నమోదయ్యాయి. మరోవైపు రాయదుర్గం, కూకట్‌పల్లి, కేపీహెచ్‌, ఆర్‌సీ పురంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మాదాపూర్‌లో మద్యం తాగి వాహనం నడుపుతూ ఒక్కరు పట్టుబడ్డారు.

వీరిలో 245 మంది డ్రైవర్ల రక్తంలో ఆల్కహాల్ సాంద్రతలు (BAC) 35mg/100ml నుంచి 200mg/100ml మధ్య ఉన్నాయి. మరో 18 మందికి 200mg/100ml నుంచి 300mg/100ml మధ్య BAC రీడింగ్ వచ్చింది. తొమ్మిది మంది వ్యక్తులకు అత్యధికంగా 301mg/100ml నుంచి 500mg/100ml మధ్యన రీడింగ్ నమోదయ్యింది.

BAC అనేది ఒక వ్యక్తి రక్తప్రవాహంలో ఉన్న ఆల్కహాల్ మొత్తాన్ని సూచిస్తుంది. దీనిని గ్రాముల పర్ డెసిలీటర్ (g/dL)లో కొలుస్తారు.  BAC పరిమితి 0.03% (30 mg/dL) ఉంటే ఎలాంటి కేసు నమోదు చేయరు. అంటే ఆ వ్యక్తి ఇన్‌ప్లూయెన్స్ అవ్వని స్థాయిలో మద్యం సేవించినట్లు లెక్క. ఈ పరిమితికి మించి రీడింగ్ వస్తే మాత్రం మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 185 కింద కేసు ఫైల్ చేస్తారు.

మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రాణాంతక ప్రమాదాలకు కారణమైన వారిపై భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 105 కింద అభియోగాలు మోపనున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.  ఈ చట్టం ప్రకారం నేరం రుజువైతే గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తారు.

(ఒక్కటి గుర్తుపెట్టుకోండి: అస్సలు మద్యం సేవించడమే ఆరోగ్యానికి హానికారం. మద్యం తాగడమే కాకుండా వాహనం సైతం డ్రైవ్ చేస్తే.. మీతో పాటు ఎదుటివారికి ప్రాణాంతకం)

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..   

Follow Us