
రాజధాని నగరం హైదరాబాద్‌తో పాటు తెలంగాణ తడిసి ముద్దవుతోంది. అనేక ప్రాంతాల్లో నాన్‌స్టాప్‌గా కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మసబ్ ట్యాంక్, మెహిదీపట్నం, అమీర్‌పేట్, యూసఫ్‌గూడ, క్రిష్ణానగర్, పంజాగుట్ట, బేగంపేట్, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, జీడిమెట్ల, పరిసర ప్రాంతాల్లో వాన హోరెత్తిస్తుంది. గ్యాప్ తీసుకుని దశలవారీగా దంచికొడుతుంది. ఖైరతాబాద్, కూకట్‌పల్లి, మియాపూర్ ప్రాంతాలలో కూడా వర్షం పడుతోంది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ అధికారులు.. వరద ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలను అలెర్డ్ చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో ప్రధాన రహదారులు వరద కాలువులను తలపిస్తున్నాయి. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణలో నేడు (ఆగస్టు 26) పలు ప్రాంతాలలో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాలలో కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. కొన్ని జిల్లాల్లో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, కొమురం భీం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, యాదాద్రి భువనగిరి, జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం తదితర జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Also Read:‘అమ్మా.. నాన్న నన్ను క్షమించండి. మీ మాట నిలబెట్టుకోలేకపోయాను’… ఎంసెంట్‌లో క్వాలిఫై కాకపోవడంతో..