Telangana Children Vaccine: కొవిడ్ తగ్గిందన్న నిర్లక్ష్యం తగదని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 12-14 ఏళ్ల చిన్నారుల కోసం వ్యాక్సినేషన్‌ను ఖైరతాబాద్ వెల్‌నెస్ సెంటర్లో మంత్రి హరీష్ రావు(Minister Harish Rao) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికీ కరోనా తీవ్రత పూర్తిగా తగ్గలేదని.. అందుకు చైనా, హాంకాంగ్, అమెరికాలో కేసుల పెరుగుతున్న విషయాన్ని గుర్తుచేశారు. 12-14ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ అందివ్వడం ఆనందంగా ఉందన్న మంత్రి.. ఆ టీకా హైదరాబాద్ కేంద్రంగా తయారవ్వడం గర్వకారణమన్నారు. కరోనా కట్టడికి ఏకైక మార్గం టీకాలే (Covid Vaccine) అని అన్నారు. కోవిడ్-19ని ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా ఇవాళ్టి 12-14 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్‌ను ఇవాళ్టి(మార్చి 16) నుంచి అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం ఇప్పటికే ఖరారు చేసింది.
ఈ వయసు పిల్లలు ఆంధ్రప్రదేశ్‌లో 14.50 లక్షలు ఉండగా.. తెలంగాణలో 17.23 లక్షల మంది చిన్నారు ఉన్నారు. అందిరికీ వ్యాక్సిన్ అందించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాటు పూర్తి చేశాయి. టీకా తీసుకోవాలంటే కోవిడ్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. లేకపోతే టీకా కేంద్రంలో కూడా పొందవచ్చు. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో 2021 మార్చి 1 నాటికి 12-13 ఏళ్ల వయసు చిన్నారులు 4.7 కోట్ల మంది ఉన్నారు.అలాగే 60 ఏళ్ల దాటిన వారందరూ మార్చి 16 నుంచి ప్రికాషన్ డోసు (బుస్టర్ డోసు) తీసుకునేందుకు అర్హులు.
ఇవి కూడా చదవండి: CM Jagan: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. తల్లుల ఖాతాల్లోకి విద్యా దీవెన నిధులు..