AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSRTC: చిల్డ్రన్స్ డే వేళ చిన్నారులకు గుడ్ న్యూస్.. బంపర్ ఆఫర్ ప్రకటించిన టీఎస్ఆర్టీసీ..

తెలంగాణ ఆర్టీసీలో సరికొత్త నిర్ణయాలు.. ఆఫర్లతో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ ఎంపికైనప్పటి నుంచి

TSRTC: చిల్డ్రన్స్ డే వేళ చిన్నారులకు గుడ్ న్యూస్.. బంపర్ ఆఫర్ ప్రకటించిన టీఎస్ఆర్టీసీ..
Ts Rtc
Rajitha Chanti
|

Updated on: Nov 14, 2021 | 12:55 PM

Share

తెలంగాణ ఆర్టీసీలో సరికొత్త నిర్ణయాలు.. ఆఫర్లతో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ ఎంపికైనప్పటి నుంచి టీఆర్టీసీ అభివృద్ది దిశగా అడుగులు వేస్తుంది. అంతేకాకుండా.. ప్రజలకు ఆర్టీసీ ప్రయాణం గురించి.. భద్రత గురించి పూర్తి అవగాహన కల్పించడమే కాకుండా.. అందరూ ఆర్టీసీ ప్రయాణానికి ఆసక్తి చూపేలా ఎండీ సజ్జనార్ చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే టీఎస్ఆర్టీసీ పలు ఆఫర్లను ప్రకటిస్తుంది. ఇప్పటికే పెళ్లిళ్లకు బస్సులను బుక్ చేసుకుంటే నూతన వధువరులకు బహుమతులు ఇవ్వనున్నట్లుగా ప్రకటించింది టీఎస్ఆర్టీసీ. అంతేకాకుండా.. ముందస్తు అడ్వాన్స్ లేకుండానే వివాహాలకు బస్సులు బుక్ చేసుకోవచ్చని ప్రకటించిన సంగతి తెలిసిందే.

బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఆర్టీసి చిన్నారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా.. 15 ఏళ్ల లోపు పిల్లలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. ఈ విషయనాన్ని ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది టీఎస్ఆర్టీసీ. ఇందుకు సంబంధించిన నిర్ణయాన్ని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి.. ఎండీ సజ్జనార్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపింది. ఇవాళ 15 ఏళ్ళలోపు చిన్నారులు ఆర్టీసీకి చెందిన ఏసీ, మెట్రో, డీలక్స్, ఆర్డినరీ.. ఏ బస్సులో ప్రయాణించిన టికెట్ అవసరం లేదని తెలిపారు. టీఎస్ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రేట్ ఐడియా.. చిన్నారులకు స్పెషల్ గిఫ్ట్ అని.. టీఎస్ఆర్టీసీ కచ్చితంగా అభివృద్ధి చెందుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ట్వీట్..

టీఎస్ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ ఎంపికైనప్పటి నుంచి ఆర్టీసీ కొత్త పుంతలు తొక్కుతుంది. ఇప్పటివరకు అప్పుల ఉబిలో కూరుకుపోయిన ఆర్టీసీని ఆర్థికంగా గట్టేక్కించేందుకు సజ్జనార్ ప్రణాళికలు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం సరికొత్త చర్యలు చేపడుతుంది. ఈ క్రమంలోనే టికెట్టు తీసుకునే సమయంలో ఆన్ లైన్ ట్రాన్స‏క్షన్ సేవలు కూడా ప్రారంభించబోతున్నట్లుగా ఇప్పటికే ఆర్టీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Also Read: Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ విన్నర్‏గా గెలుస్తావని నమ్మకం ఉంది.. అతనికి మద్దతు తెలిపిన టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్..

Allu Arha beautiful photos: వావ్ క్యూట్ క్యూట్ గా అల్లు అర్హ.. ఈ ఫొటోస్ చుస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..

Nazriya Nazim New Photos: ఎక్స్‌ప్రెష‌న్ క్వీన్ న‌జ్రియా నయా అందాలు ఆకట్టుకుంటున్న ముద్దుగుమ్మ ఫొటోలు..