Good News: అమెరికా వెళ్లే విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఉచిత సేవా కేంద్రం.. తొలిసారిగా హైదరాబాద్‌లో ఏర్పాటు
Good News: ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లే విద్యార్థులకు గుడ్‌న్యూస్. యూఎస్ వెళ్తున్న తెలుగు విద్యార్థుల సౌకర్యం కోసం అక్కడి ప్రభుత్వ పర్యవేక్షణలో పని చేస్తున్నయూఎస్‌ఏ..
Good News: ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లే విద్యార్థులకు గుడ్‌న్యూస్. యూఎస్ వెళ్తున్న తెలుగు విద్యార్థుల సౌకర్యం కోసం అక్కడి ప్రభుత్వ పర్యవేక్షణలో పని చేస్తున్నయూఎస్‌ఏ ఎడ్యుకేషన్ సంస్థ హైదరాబాద్‌లో ఉచిత సేవా కేంద్రాన్ని వైయాక్సిస్ సంస్థతో కలిసి ఏర్పాటు చేయనుంది. ఎడ్యుకేషన్ యూఎస్‌ఏ సంస్థ ఇలాంటి సేవా కేంద్రాన్ని మన దేశంలో ఏర్పాటు చేయడం తొలిసారి. అయితే ఇది కూడా హైదరాబాద్‌లోనే ఏర్పాటు కావడం విశేషం. కొత్త సేవా కేంద్రాన్ని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో శుక్రవారం ప్రారంభించనుంది. అమెరికాలో ఉన్నత చదువుల కోసం దేశం నుంచి వెళుతున్న విద్యార్థుల్లో 40 శాతానికి పైగా తెలుగువారే. ఏ అర్హతలున్న వారు ఎలాంటి విశ్వవిద్యాలయాలను ఎంచుకోవాలి? ఫీజులు ఎలా చెల్లించాలి? స్టూడెం ట్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలనే ఆంశాలపై అవగాహన లేక విద్యార్థులు బోగస్ సంస్థల చేతిలో తీవ్రంగా నష్టపోతున్నారు.
కాగా, విద్యార్థులు చదువుల కారణంగా సమయాన్ని, డబ్బును వృధా చేసుకుంటున్నారు. విద్యార్థులకు ఆ ఇబ్బందులు తప్పించి, సరైన సలహాలు అందించేందుకు కొత్త సేవా కేంద్రం ఎంతగానో ఉపయోగపడనుంది.. విద్యార్థుల కోసం హైదరాబాద్ బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో అమెరికన్ కార్నర్ పేరుతో ఇప్పటికే ఒక కేంద్రాన్ని నిర్వహిస్తోంది. ఆ సేవా కేంద్రం వారంలో ఒక రో జు మాత్రమే ఉంటుంది. పైగా ముందుగా అపాయింట్‌మెం ట్ తీసుకుని ఆ కేంద్రం నుంచి సేవలు పొందాల్సి ఉంటుంది. కొత్త సేవా కేంద్రం వారంలో 5 రోజుల పాటు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల దాకా పనిచేస్తుంది. పైగా విద్యార్థులు నేరుగా ఈ కేంద్రానికి వెళ్లి అక్కడ ఉండే నిపుణులను కలుసుకుని తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
ఇవి చదవండి :
Chinese Hackers: భారత్‌పై సైబర్ దాడి.. చైనా ప్రభుత్వం సహకారంతో హ్యాకింగ్ బృందాలు.. స్పందించిన చైనా