గ్లోబల్ బిలియనీర్ క్లబ్లో హైదరాబాదీలు… చోటు దక్కించుకున్న వ్యాపార దిగ్గజాలు.. ఇంతకీ వారెవరంటే.!
హురూన్ అంతర్జాతీయ సంపన్నుల జాబితాలో ఫార్మా దిగ్గజాలు హవా సృష్టించారు. హైదరాబాద్ నుంచి మొత్తంగా 10 మంది సంపన్నులకు చోటు దక్కించుకున్నారు.

- మురళీ దివి: దివీస్ ల్యాబ్స్– రూ.54,100 కోట్లు, దేశంలో ర్యాంకు 20, ప్రపంచ ర్యాంకు 385
- పీవీ రాంప్రసాద్ రెడ్డి: అరబిందో ఫార్మా– రూ.22,600 కోట్లు, దేశ ర్యాంకు 56, ప్రపంచ ర్యాంకు 1,096
- బి. పార్థసారథి రెడ్డి: హెటిరో డ్రగ్స్– రూ.16,000 కోట్లు, దేశ ర్యాంకు 83, ప్రపంచ ర్యాంకు 1,609
- కె. సతీశ్ రెడ్డి: డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్– రూ.12,800 కోట్లు, దేశ ర్యాంకు 108, ప్రపంచ ర్యాంకు 2,050
- జీవీ ప్రసాద్, జీ అనురాధ: డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్– రూ.10,700 కోట్లు, దేశ ర్యాంకు 133, ప్రపంచ ర్యాంకు 2,238
- .పి. పిచ్చిరెడ్డి: మేఘా ఇన్ ఫ్రాస్ట్రక్చర్– రూ.10,600 కోట్లు, దేశ ర్యాంకు 134, ప్రపంచ ర్యాంకు 2,383
- జూపల్లి రామేశ్వరరావు: మై హోం ఇండస్ట్రీస్– రూ.10,500 కోట్లు, దేశ ర్యాంకు 138, ప్రపంచ ర్యాంకు 2,383
- పీవీ కృష్ణారెడ్డి: మేఘా ఇంజనీరింగ్– రూ.10,400 కోట్లు, దేశ ర్యాంకు 140, ప్రపంచ ర్యాంకు 2,383
- ఎం. సత్యనారాయణ రెడ్డి: ఎంఎస్ఎన్ ల్యాబ్స్– రూ.9,800 కోట్లు, దేశ ర్యాంకు 143, ప్రపంచ ర్యాంకు 2,530
- వీసీ నన్నపనేని: నాట్కో ఫార్మా– రూ.8,600 కోట్లు, దేశ ర్యాంకు 164, ప్రపంచ ర్యాంకు 2,686










