Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై మెట్రో కార్డు వాడాల్సిన అవసరం లేదు..

| Edited By: Velpula Bharath Rao

Dec 24, 2024 | 8:53 PM

ప్రతిరోజు మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులకు మెట్రో కార్డు అనేది అవసరం. టెన్ పర్సెంట్ డిస్కౌంట్‌తో పాటు టికెట్ కౌంటర్ వద్ద క్యూ లైన్‌లో నిలిచిన అవసరం లేకుండా మెట్రో కార్డు ఉపయోగపడుతుంది. అయితే చాలామంది ప్రయాణికులకు ఈ మెట్రో కార్డు కొన్ని చేదు అనుభవాలను కూడా మిగులుస్తోంది. కార్డును కామన్‌గా ప్రయాణికులు పర్సులోనూ, ఫోన్ పౌచ్ వెనకాలను పెట్టుకుంటూ ఉంటారు

Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై మెట్రో కార్డు వాడాల్సిన అవసరం లేదు..
Hyderabad Metro
Follow us on

హైదరాబాదులో మెట్రో రైల్ చాలామంది జీవితాల్లో ఒక భాగంగా మారిపోయింది. పొల్యూషన్, సౌండ్, రిస్క్ లేని స్పీడ్ జర్నీ కోసం లక్షల మంది మెట్రోను వాడుతున్నారు. ప్రతిరోజు మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులకు మెట్రో కార్డు అనేది అవసరం. టెన్ పర్సెంట్ డిస్కౌంట్‌తో పాటు టికెట్ కౌంటర్ వద్ద క్యూ లైన్‌లో నిలిచిన అవసరం లేకుండా మెట్రో కార్డు ఉపయోగపడుతుంది. అయితే చాలామంది ప్రయాణికులకు ఈ మెట్రో కార్డు కొన్ని చేదు అనుభవాలను కూడా మిగులుస్తోంది. కార్డును కామన్‌గా ప్రయాణికులు పర్సులోనూ, ఫోన్ పౌచ్ వెనకాలను పెట్టుకుంటూ ఉంటారు. కొన్ని రోజులకు అది విరిగిపోవడం, లేదా చిన్నపాటి స్క్రాచెస్ పడిన పని చేయకుండా ఉండడం అత్యవసర సమయంలో మళ్లీ క్యూ లైన్‌లో నిల్చడం చిరాకు పుట్టిస్తుంది. దీంతోపాటు మెట్రో కార్డు రీఛార్జ్ చేయాల్సిన ప్రతిసారి మళ్లీ కౌంటర్‌కు వెళ్లాల్సిందే, లేదా ఏదైనా థర్డ్ పార్టీ యాప్ ద్వారా రీచార్జ్ చేసుకోవాలి. కానీ త్వరలోనే ఈ చిక్కులు వీడనున్నాయి. ఇప్పటికే ఢిల్లీ మెట్రోలో డీఎంఆర్‌సీ అనే యాప్ ప్రవేశపెట్టారు. ఇందులో ఎప్పటికప్పుడు ఏదైనా యూపీఐ యాప్ ద్వారా రీచార్జ్ చేసుకొని డైరెక్ట్‌గా వాడుకోవచ్చు.

ఇప్పుడు ఎలా అయితే మెట్రో కార్డు ఎంట్రెన్స్ టాప్ చేస్తున్నామో.. అలాగే ఈ యాప్ ఓపెన్ చేసి అక్కడున్న కెమెరాకు టాప్ చేస్తే సరిపోతుంది. మీ అకౌంట్లో నుంచి జర్నీకి సంబంధించిన డబ్బులు కట్ అయిపోతుంది. ఈ యాప్ వాడిన అదే డిస్కౌంట్‌ను మెట్రో ప్రయాణికులకు ఇచ్చేస్తుంది. ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని మెట్రో కార్డును క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చూపియడంతో పాటు మీ ట్రిప్ హిస్టరీని కూడా చూపిస్తుంది. ఏ టైం కి ఎక్కడ చెకింగ్ అయ్యారు, ఏ స్టేషన్లో ఎప్పుడు దిగారు అనే పూర్తి వివరాలను యాప్‌లో చూసుకోవచ్చు.  రీఛార్జ్ కూడా విత్ ఇన్ సెకండ్స్‌లో చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఢిల్లీలో యాప్ ద్వారా లక్షల మంది ప్రయాణికులు హ్యాపీ జర్నీ చేస్తున్నారు. త్వరలోనే హైదరాబాద్ మెట్రోలో కూడా ఇలాంటి మొబైల్ అప్లికేషన్ రానుంది. ఇప్పటికే దీన్ని మెట్రో అధికారులు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్లో ప్రయాణికులకు న్యూ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి సిద్ధమవుతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి