Hyderabad: నోరు తెరిచి మాటు వేసిన మ్యాన్‌హోల్.. స్కూల్‌కు అటుగా వచ్చిన బుజ్జి తల్లి.. చివరకు..
హైదరాబాద్ నగరంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మ్యాన్ హోల్ తెరచి ఉండటంతో.. స్కూల్‌కు వెళ్తూ ఓ విద్యార్థిని డ్రైనేజీలో పడిపోయింది.. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీలోని యాకుత్‌పురాలో చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీ సిబ్బంది డ్రైనేజీ మూతను తెరిచి ఉంచడంతో.. స్కూల్‌కు వెళ్తూ బాలిక డ్రైనేజీలో పడిపోయింది.

మ్యాన్ హోల్స్ గతంలో ఎన్నో ప్రాణాలను బలిగొన్నాయి. మ్యాన్ హోల్‌లో పడి తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. అయినా.. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం పలు విమర్శలకు దారితీస్తోంది.. తాజాగా.. హైదరాబాద్ నగరంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మ్యాన్ హోల్ తెరచి ఉండటంతో.. స్కూల్‌కు వెళ్తూ ఓ విద్యార్థిని డ్రైనేజీలో పడిపోయింది.. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీలోని యాకుత్‌పురాలో చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీ సిబ్బంది డ్రైనేజీ మూతను తెరిచి ఉంచడంతో.. స్కూల్‌కు వెళ్తూ బాలిక డ్రైనేజీలో పడిపోయింది. గమనించిన తల్లి బాలికను సకాలంలో కాపాడింది. బాలిక డ్రైనేజీలో పడటాన్ని చూసిన స్థానికులు వెంటనే అక్కడకు పరిగెత్తుకుంటూ వచ్చారు.. డ్రైనేజీలో పడిన బాలికను తల్లి వెంటనే పైకి లాగగా.. స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి పుస్తకాలను బయటకు తీశారు. చిన్నారి క్షేమంగా ఉండడంతో అంతా ఊపిరీ పీల్చుకున్నారు. అధికారుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారుతోందని.. అయినా.. ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
వీడియో చూడండి..
అయితే.. మ్యాన్‌హోల్ ఇలా తెరిచి వదిలేయడం ఏంటి..? మ్యాన్‌హోల్ ఎవరు తెరిచారు.. ఎందుకలా వదిలేశారు..? వర్షం నీళ్లు పేరుకుపోయాయని ఇలా తెరిచి వదిలేస్తారా..? మ్యాన్‌హోల్ తెరిస్తే ఎలాంటి హెచ్చరిక బోర్డూ ఎందుకు పెట్టలేదు..? డ్రైనేజ్‌లో పడి ఎవరైనా ప్రాణాలు కోల్పోతే బాధ్యత ఎవరిది..? పాతబస్తీలో నాలాల నిర్వహణపై సరైన పర్యవేక్షణే లేదా..?.. మ్యాన్‌హోల్‌లో పడిన పాపకు ఏమైనా అయితే ఎవరిది బాధ్యత..? అంటూ ప్రశ్నిస్తున్నారు స్థానికులు.. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇప్పటికైనా అధికారులు ప్రాణాలు తీసే మ్యాన్ హోళ్ల గురించి దృష్టిపెట్టాలని పలువురు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




