Hyderabad: బరితెగించిన గంజాయ్ బ్యాచ్.. బాలుడిని గుట్టల్లోకి తీసుకెళ్లి బట్టలు విప్పి..

|

Mar 02, 2023 | 12:19 PM

తెలంగాణలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. గంజాయ్ బ్యాచ్ ఓ బాలుడి (17) ని చిత్రహింసలకు గురిచేసింది. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో వెలుగులోకి వచ్చింది.

Hyderabad: బరితెగించిన గంజాయ్ బ్యాచ్.. బాలుడిని గుట్టల్లోకి తీసుకెళ్లి బట్టలు విప్పి..
Crime News
Follow us on

తెలంగాణలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. గంజాయ్ బ్యాచ్ ఓ బాలుడి (17) ని చిత్రహింసలకు గురిచేసింది. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో వెలుగులోకి వచ్చింది. కొందరు గంజాయి మత్తులో మైనర్ బాలుడిపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. గంజాయి బ్యాచ్ కు డబ్బులు ఇవ్వనందుకు ఈ విధంగా యువకుడిని తీసుకెళ్లి చితకబాదనట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకివచ్చింది. డబ్బులు అడిగితే ఇవ్వలేదని.. కిరాణా దుకాణంలో కూర్చున్న యువకుడిని గంజాయ్ బ్యాచ్ బలవంతంగా సమీపంలోని గుట్టల వద్దకు తీసుకెళ్లారు. అనంతరం గంజాయికి డబ్బులు ఇవ్వాలంటూ బాలుడి బట్టలు విప్పి బెల్ట్, కర్రలతో తీవ్రంగా కొడుతూ చిత్రహింసలు పెట్టారు‌. ఈ క్రమంలో అర్ధరాత్రి గంజాయి గ్యాంగ్‌ నుంచి ఎలాగో తప్పించుకొని బాలుడు తన ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. ఒంటిపై గాయాలను చూసిన బాలుడి కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై బాలుడి తల్లిదండ్రులు మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మహమ్మద్ సైఫ్, అబ్బూ, సమీర్‌తోపాటు మరో ఐదుగురిపై బాలుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఇద్దరిని హత్య చేశాం.. నిన్ను కూడా చంపేస్తా.. ఎక్కడైనా చెప్పుకో అంటూ గంజాయ్ గ్యాంగ్‌ బాలుడిని బెదిరించినట్లు పేర్కొంటున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలసీులు గంజాయి బ్యాచ్ కోసం వేట మొదలుపెట్టారు. కాగా, గత కొంతకాలంగా మైలార్ దేవ్ పల్లి పోలీసుపరిధిలో గంజాయి బ్యాచ్ ఆగడాలు మితిమీరి పోయాయని స్థానికులు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..