AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: నవీన్‌ హత్య కేసులో జగమొండికి తాతలా మారిన ఆ యువతి.. పోలీసులు షాక్..!

ఇది పక్కా మర్డర్‌ ప్లానే అని తేల్చారు పోలీసులు. ఇదే విషయాన్ని నవీన్‌ గుండెకోసిన హరిహర కేసులో పోలీసులు ఇచ్చిన రిపోర్ట్‌‌లో పేర్కొన్నారు. కానీ ఈ కేసుకి సంబంధం ఉన్న అమ్మాయి నోరే మెదపడంలేదు.

Telangana: నవీన్‌ హత్య కేసులో జగమొండికి తాతలా మారిన ఆ యువతి.. పోలీసులు షాక్..!
Naveen Murder Case
Shiva Prajapati
|

Updated on: Mar 02, 2023 | 9:48 AM

Share

ఇది పక్కా మర్డర్‌ ప్లానే అని తేల్చారు పోలీసులు. ఇదే విషయాన్ని నవీన్‌ గుండెకోసిన హరిహర కేసులో పోలీసులు ఇచ్చిన రిపోర్ట్‌‌లో పేర్కొన్నారు. కానీ ఈ కేసుకి సంబంధం ఉన్న అమ్మాయి నోరే మెదపడంలేదు. ఎన్ని ప్రశ్నలడిగినా ఒక్క జవాబు కూడా చెప్పడంలేదు. జగమొండికి తాతలా మారిన ఆ యువతి ఈరోజైనా నోరు విప్పుతుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

నవీన్ హత్య దర్యాప్తులో పోలీసులు విస్తుపోయే నిజాలను వెలుగులోకి తెచ్చారు. హత్య తరువాత నిందితుడు తన స్నేహితుడు హసన్, స్నేహితురాలు, తండ్రికి ఘటన గురించి చెప్పాడని పోలీసులు తేల్చారు. అందరికీ తెలిసినా ఈ విషయాన్ని ఏ ఒక్కరూ పోలీసులకు చెప్పలేదని ఖాకీలు కన్నెర్రజేస్తున్నారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు చాలా సీరియస్‌గా ఉన్నారు. నిన్న జరిగిన విచారణలో హరిహరకృష్ణ, అతని స్నేహితురాలు ఒక్కరూ సహకరించలేదని పోలీసులు చెబుతున్నారు. అయితే ఇంతటి హత్యను కూడా చాలా తేలికగా తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడి కస్టడీ విచారణ ముగిస్తే ఆధారాలతో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ త్వరగా పూర్తిచేసేలా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే హరిహరకృష్ణ, నిహారికను మూడు సార్లు పోలీసులు విచారించారు. అంతేకాదు.. సఖి సెంటర్‌లో కౌన్సిలింగ్ ఇప్పించినా అమ్మాయి తీరు మారలేదని పోలీసులు చెబుతున్నారు. తాము చాలా పేదరికానికి చెందిన వారని.. అమ్మాయి కుటుంబ సభ్యులు మాత్రం పోలీసులు ఎదుట రోదిస్తున్నారు. కౌన్సిలింగ్ ఇప్పించినా, కుటుంబ సభ్యులు ఇంత బాధపడుతున్నా అమ్మాయిలో మాత్రం పశ్చాత్తాపం కనపడడం లేదని పోలీసులే ఆశ్చర్యపోతున్నారు.

నవీన్ హత్య కేసులో హరిహరకృష్ణ బెస్ట్ ఫ్రెండ్ హసన్‌ను కూడా పోలీసులు విచారించారు. హత్య తర్వాత నిందితుడు బ్రహ్మణపల్లిలోని హసన్ ఇంటికి వెళ్లాడని పోలీసులు తేల్చారు. అతని చొక్కాపై రక్తపు మరకలతోనే అక్కడికి వెళ్లడంతో.. స్నేహితుడు హసన్‌ నిలదీశాడు. ఒక వ్యక్తిని చంపానని మాత్రమే తనకు చెప్పాడని హసన్‌ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. తన ఇంట్లో ఉన్నపుడే చాలామందికి కాల్స్‌ చేశాడని.. ఆతర్వాత స్నానం చేసి వెళ్ళి పోయాడని హసన్‌ అంటున్నాడు. పోలీసుల ఎదుట లొంగిపోవాలని తాను చాలాసార్లు చెప్పానని.. హరిహరకృష్ణ మాత్రం తండ్రికి చెప్పిన తర్వాతే పోలీసులు ఎదుట లొంగిపోతానన్నాడని హసన్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. ఇంత తెలిసినా కనీసం పోలీసులకు ఎందుకు చెప్పలేదని హసన్‌పై ఖాకీలు సీరియస్ అయ్యారు.

ఇవి కూడా చదవండి

నవీన్‌ హత్య కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లోని కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. ఈ కాపీని హయత్‌నగర్‌ కోర్టుకు సమర్పించారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఐడియల్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియెట్‌ చదివే సమయంలో నవీన్‌, ఓ యువతి ప్రేమించుకున్నారు. ఇద్దరూ సన్నిహితంగా మెలిగేవారు. ఆ తర్వాత గొడవలు జరగడంతో.. రెండేళ్ల కిందట విడిపోయారు. ఈ సమయంలో హరిహరకృష్ణ ఆ అమ్మాయికి ప్రపోజ్‌ చేయగా ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. ఈ మధ్య నవీన్‌, ఆ అమ్మాయితో టచ్‌లోకి వచ్చాడు. దీంతో నిందితుడు నవీన్‌పై కక్ష పెంచుకుని.. అతణ్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడని హయత్‌నగర్‌ కోర్టుకు సమర్పించిన ఎఫ్‌ఐఆర్‌ కాపీలో అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు రాసుకొచ్చారు. నవీన్‌ను హరిహరకృష్ణ హత్య చేసిన తీరు గురించి కూడా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో వివరించారు. ‘‘నవీన్‌ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన హరిహరకృష్ణ.. అతణ్ని బైక్‌ పై నుంచి కింద పడేసి, అతడు తేరుకునేలోగా గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత కత్తితో మెడ కోసి.. తలను మొండెం నుంచి వేరు చేశాడు. ఆ తర్వాత మర్మాంగాన్ని కోసేసి… నవీన్‌ శరీరం నుంచి గుండెను బయటకు తీశాడు. చేతి వేళ్లను కూడా కట్‌ చేసి అక్కణ్నుంచి పరారయ్యాడని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పొందుపర్చారు. బైక్‌ డ్రైవ్‌ చేస్తున్న సమయంలో కూడా అతని చేతికి గ్లౌజులు ఉన్నాయని వారు అనుమానిస్తున్నారు. హత్యకు ముందుగానే నిందితుడు ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించుకుని ఉండవచ్చని వారు భావిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..