AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పెళ్లి సంబంధం పేరుతో కుచ్చుటోపి.. స్నేహితుడి నుంచి రూ.10లక్షలు కాజేసిన కేటుగాడు!

పెళ్లి సంబంధం పేరుతో స్నేహితుడి నుంచి డబ్బు కాజేశాడు ఓ కేటుగాడు. తనకు పెళ్లి సంబంధం సెట్‌ చేస్తానని చెప్పి ఓ యువతిని పరిచయం చేసి ఆమో ద్వారా అతన్ని నుంచి డబ్బులు కాజేసి పరారయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Hyderabad: పెళ్లి సంబంధం పేరుతో కుచ్చుటోపి.. స్నేహితుడి నుంచి రూ.10లక్షలు కాజేసిన కేటుగాడు!
Jublee Hills Ps
Anand T
|

Updated on: May 10, 2025 | 11:22 AM

Share

పెళ్లి సంబంధం పేరుతో యువతిని పరిచయం చేసి స్నేహితుడి నుంచి ఓ కేటుగాడు డబ్బు కాజేసిన ఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పీఎస్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లా రాజోలు మండలానికి చెందిన నానీ కుమార్ హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో నివాసం ఉంటున్నాడు. అయితే ఇతని పసుపులేటి తాతా శ్రీనివాస్‌ అనే స్నేహితుడు ఉన్నాడు. అయితే నానికి వయస్సు మీదపడుతుండడంతో కొన్ని రోజులుగా పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నాడు. ఎన్ని చూసినా సరైన సంబంధాలు దొరకకపోవడంతో ఈ విషయాన్ని తన స్నేహితుడు శ్రీనివాస్‌ దృష్టికి తీసుకెళ్లాడు. అయితే దీన్ని అదునుగా చేసుకున్న శ్రీనివాస్ నానీని మోసం చేసేందుకు కుట్రపన్నాడు.

శ్రీనివాస్ తనకు దూరపు చుట్టమైన మణికొండలో నివాసం ఉంటున్న గడ్డం శ్రావణి అనే యువతికి ఈ విషయం చెప్పాడు. ఇద్దరు కలిసి నానీని మోసం చేసేందకు ప్లాన్ చేసుకున్నారు. ఇక పథకం ప్రకారం శ్రీనివాస్ శ్రావణని నానీకి పరిచయం చేశాడు. ఆమెను పెళ్లి కూడా ఒప్పిస్తానని నానిని నమ్మించాడు. ఈ క్రమంలోనే నాని, శ్రావణి మధ్య ఫోన్‌లో మాట్లాడుకోవడం, చాటింగ్‌ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఇలానే కొన్నాళ్లపాటు సాగించారు. నాని కలుద్దామని చెప్పినా ఏవేవో కారణాలు చెప్తూ.. దాన్ని దాటవేస్తూ వచ్చింది శ్రావణి. అయితే ఒక రోజు మనం పెళ్లి చేసుకుందాం అని.. పెళ్లికి ఏర్పాట్లు చేసుకొని శ్రావణి నానికి చెప్పింది.

ఈ క్రమంలో ఒక రోజు నాని ఫోన్‌ చేయగా తన పేరెంట్స్‌ అనారోగ్యంతో బాధపడుతున్నారని.. వాళ్లకు వైద్యం చేయించేందుకు సహాయం చేయాలని.. తర్వాత మళ్లీ డబ్బులు తిరిగి ఇస్తానని శ్రావణి నానిని కోరింది. నిజమని నమ్మిన నాని ఆమె చెప్పిన పలు నంబర్లు సుమూరు రూ.10లక్షల దాకా చెల్లించినట్టు తెలుస్తోంది. అయితే డబ్బులు పంపించిన కొన్ని రోజుల తర్వాత శ్రావణి నానిని దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. నాని మెసెజ్‌లకు రిప్లై ఇవ్వకుండా.. కాల్స్‌ రిసీవ్‌ చేయకుండా ఉంది. శ్రావణి ఫోన్ ఎత్తకపోవడంతో నాని శ్రీనివాస్‌కు కాల్ చేశాడు. శ్రీనివాస్‌కు కూడా ఫోన్‌ స్విచ్ఛాఫ్ చేయడంతో తాను మోసపోయినట్టు గ్రహించిన నాని జూబ్లీహిల్స్‌ పోలీసులును ఆశ్రయించాడు. శ్రీనివాస్ అనే వ్యక్తి తనను పెళ్లి సంబంధం పేరుతో మోసం చేశాడని ఫిర్యాదుతో పేర్కొన్నాడు. నాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అయ్యబాబోయ్.. ఆస్ట్రేలియానే చిత్తు చిత్తుగా ఓడించేశారుగా..!
అయ్యబాబోయ్.. ఆస్ట్రేలియానే చిత్తు చిత్తుగా ఓడించేశారుగా..!
యువతిని వేధించిన వ్యాన్ డ్రైవర్, క్లీనర్.. సీన్ కట్‌చేస్తే..
యువతిని వేధించిన వ్యాన్ డ్రైవర్, క్లీనర్.. సీన్ కట్‌చేస్తే..
ఖాళీ కడుపుతో ఈ 9 పనులు అస్సలు చేయకండి.. ఆరోగ్యం జాగ్రత్త!
ఖాళీ కడుపుతో ఈ 9 పనులు అస్సలు చేయకండి.. ఆరోగ్యం జాగ్రత్త!
చెక్ బౌన్స్‌ కేసు నిజంగా జైలు శిక్షకు దారితీస్తుందా? రూల్స్ ఏంటి?
చెక్ బౌన్స్‌ కేసు నిజంగా జైలు శిక్షకు దారితీస్తుందా? రూల్స్ ఏంటి?
జోరు వానలో తడిచిన వాళ్ళు ఇవి రెండు గారెలు తింటే నీరసం పోయి..
జోరు వానలో తడిచిన వాళ్ళు ఇవి రెండు గారెలు తింటే నీరసం పోయి..
తల్లిదండ్రులు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఇది..
తల్లిదండ్రులు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఇది..
దుమ్మురేపిన తిలక్ సేన.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే..?
దుమ్మురేపిన తిలక్ సేన.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే..?
'సమరసింహారెడ్డి'లోని ఆ డైలాగులు పరిటాల రవి మాటలే: పరుచూరి
'సమరసింహారెడ్డి'లోని ఆ డైలాగులు పరిటాల రవి మాటలే: పరుచూరి
ఉదయాన్నే నీళ్లు ఎప్పుడు తాగాలి? బ్రష్ చేయడానికి ముందా.. తర్వాతనా?
ఉదయాన్నే నీళ్లు ఎప్పుడు తాగాలి? బ్రష్ చేయడానికి ముందా.. తర్వాతనా?
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..