
TV9 Telugu on Fake News: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అవినీతి అరోపణలు ఎదుర్కొంటూ చంద్రబాబు అరెస్ట్ అయిన నాటి నుంచి ఏపీ రాజకీయాలు కాకరేపుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడంతో ఆంధ్రా రాజకీయాలు మరింతగా వేడెక్కాయి. అయితే ఇదే అదనుగా భావించిన కొందరు కేటుగాళ్లు త్వరలో నారా లోకేష్‌ని కూడా అరెస్ట్ చేస్తారని తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. అంతటితో ఆగక ‘టీవీ9 తెలుగు’ చానల్ పేరుతో కూడా దుష్ప్రచారం చేయడం ప్రారంభించారు. ఇందులో భాగంగానే పోస్ట్ చేసిన ఓ వీడియో ‘టీవీ9 తెలుగు’ లోగో, థీమ్‌తో వైరల్ అవుతోంది. దీన్ని ‘టీవీ9 తెలుగు’ ఖండిస్తోంది. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని, పాఠకులు ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని కోరుతోంది. ‘టీవీ9 తెలుగు’ పేరును ఉపయోగించి, ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరిస్తోంది.
సోషల్ మీడియాలో "అరెస్ట్ భయంతో పరారీలో ఉన్న నారా లోకేష్" అంటూ టీవీ9 పేరిట వస్తున్న వార్త పూర్తిగా ఫేక్ న్యూస్.
ఇవి కూడా చదవండిటీవీ9 పేరుతో కొందరు ప్రచారం చేస్తున్న దుష్ప్రచారం ఇది.
ఈ వార్తకు టీవీ9కి ఎలాంటి సంబంధం లేదు.
ఇలాంటి అసత్య వార్తలు ప్రచారం చేసే వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. pic.twitter.com/93ELxyl0u3
— TV9 Telugu (@TV9Telugu) September 21, 2023