Railway News: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. ఆ డైలీ ఎక్స్‌ప్రెస్‌ హైదరాబాద్ వరకు పొడగింపు

|

May 28, 2022 | 11:38 AM

Railway Passenger Alert: ప్రయాణీకుల సౌలభ్యం కోసం రైల్వే శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పలు మార్పులు చేస్తోంది.

Railway News: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. ఆ డైలీ ఎక్స్‌ప్రెస్‌ హైదరాబాద్ వరకు పొడగింపు
Special Trains
Image Credit source: TV9 Telugu
Follow us on

Railway Passenger Alert: ప్రయాణీకుల సౌలభ్యం కోసం రైల్వే శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ -కర్నూల్ సిటీ(Secunderabad – Kurnool City ) మధ్య నడిచే హంద్రీ ఎక్స్‌ప్రెస్ (Hundry Express- Train No.17027/17028) ను హైదరాబాద్ వరకు పొడగించారు. ప్రయాణీకుల నుంచి అందిన వినతుల మేరకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి కర్నూల్ సిటీకి వెళ్లే డైలీ ఎక్స్‌ప్రెస్(నెం.17027).. ఈ నెల 30వ తేదీ నుంచి హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి  వెళ్లనుంది. ఈ హైదరాబాద్-కర్నూల్ సిటీ డైలీ ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 04.20 గం.లకు హైదరాబాద్ నుంచి బయలుదేరి.. 04.45 గం.లకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 04.50 గం.లకు బయలుదేరి కర్నూల్ సిటీకి రాత్రి 09.35 గంటలకు చేరుకుంటుంది.

అలాగే ఇన్ని రోజులు కర్నూలు సిటీ నుంచి సికింద్రాబాద్‌కు నడిచే డైలీ ఎక్స్‌ప్రెస్(నెం.17028)ను ఈ నెల 31వ తేదీ నుంచి హైదరాబాద్  వరకు పొడగించారు. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి రోజూ ఉదయం 05.30 గం.లకు కర్నూలు సిటీ నుంచి బయలుదేరి.. ఉదయం 10.40 గం.లకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి 10.45 గం.లకు బయలుదేరి 11.40 గం.లకు హైదరాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.

మిగిలిన రైల్వే స్టేషన్లలో ఈ రైలు షెడ్యూల్ మునుపటిలానే ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..