Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ వాసులకు అలెర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా బంద్

ఈ పనులు ఈ నెల 23వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు అంటే 24 వ తేదీ ఉదయం 6 గంటల వరకు జరగనున్నాయి. కాబట్టి ఈ 24 గంటలు అయా రిజర్వాయర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. అంతరాయం ఏర్పడే ప్రాంతాలు ఎక్కడంటే..

Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ వాసులకు అలెర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా బంద్
Drinking Water Supply

Edited By:

Updated on: Sep 20, 2024 | 8:27 PM

హైదరాబాద్ నగర వాసులకు గ్రేటర్ హైదరాబాద్ నగర జల మండలి అధికారులు ఓ హెచ్చరిక చేశారు. పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను బంద్ చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. నగరంలో మరోసారి వాటర్ బోర్డు పనుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు సరఫరా చేసే కృష్ణా ఫేజ్-3 రింగ్ మెయిన్-1 పరిధిలోని ప్రశాసన్ నగర్ నుంచి అయ్యప్ప సొసైటీ వరకు ఉన్న 1200 ఎంఎం డయా పీఎస్సీ గ్రావిటీ మెయిన్ పైపులైన్ కు పలు ప్రాంతాల్లో లీకేజీలు ఏర్పడ్డాయి. వీటిని అరికట్టేందుకు అధికారులు మరమ్మతు పనులు చేపట్టనున్నారు. ఈ పనులు ఈ నెల 23వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు అంటే 24 వ తేదీ ఉదయం 6 గంటల వరకు జరగనున్నాయి. కాబట్టి ఈ 24 గంటలు అయా రిజర్వాయర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది.

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:

1. ఓ అండ్ ఎం డివిజన్ నం.3 – హకీంపేట్, గోల్కొండ, టోలిచౌకి, లంగర్ హౌజ్, షేక్ పేట్.

ఇవి కూడా చదవండి

2. ఓ అండ్ ఎం డివిజన్ నం.6 & 15 – జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, తట్టిఖానా, మాదాపూర్, కొండాపూర్, డోయెన్స్, గచ్చిబౌలి.

నీటి సరఫరా కు 24 గంటల పాటు అంతరాయం ఏర్పడను ఉండడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలంతా నీటిని ముందు రోజు పొదుపుగా వాడుకొని 24 గంటల పాటు వారికో గలరని వాటర్ బోర్డు అధికారులు సూచన జారీ చేశారు.

 

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..