Dimple Hayati vs IPS Officer: నటి వర్సెస్.. ఐపీఎస్ ఆఫీసర్.. సీన్ కట్‌చేస్తే, కేసులు, ఆరోపణలు.. ఇంకా ఎన్నో విషయాలు.. ఇలా డింపుల్ హయాతి, డీసీపీ రాహుల్ హెగ్డే (ఐపీఎస్) గొడవ వ్యవహారం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతోపాటు.. పోలీసు డిపార్ట్‌మెంట్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఇద్దరి గొడవ కాస్తా ట్రాఫిక్ పోలీసుల మెడకు చుట్టుకునేలా మారింది. అసలు వారి మధ్య జరిగింది పార్కింగ్ గొడవ.. కానీ, ఇది అధికార దుర్వినియోగం వరకు వెళ్లింది. ఎందుకిలా జరిగింది.. ఇంతకీ తప్పు ఎవరిదీ..? నటి డింపుల్ హయాతిదా..? లేక ఐపీఎస్ ఆఫీసర్‌దా..? అనేది పోలీసులు తేల్చే పనిలో ఉన్నారు.
అసలు ఏం జరిగిందంటే..? హైదరాబాద్‌లోని జర్నలిస్టు కాలనీలో నటి డింపుల్ హయతి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే ఒకే అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో పార్కింగ్ ప్లేస్‌లో ఉన్న రాహుల్ హెగ్డే వాహనాన్ని డింపుల్ హయతి కాబోయే భర్త ఢీకొట్టాడని.. ఈ క్రమంలో డింపుల్ తన కారుని కాలితో తన్నారని డీసీపీ డ్రైవర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. రాహుల్ హెగ్డే డ్రైవర్ చేతన్ కుమార్ ఫిర్యాదుతో 353, 341, 279 సెక్షన్ల కింద జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంత వరకు పార్కింగ్ విషయంలో చెలరేగిన వివాదం అని అందరికీ అర్ధమైంది.
ఇంత వరకు ఓ క్లారిటీ ఉంటే.. డింపుల్ హయాతి స్పందించిన తర్వాత సీన్ అంతా మారింది. కావాలనే ఆమెను టార్గెట్ చేశారు.. ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన గొడవను.. పోలీసులు అధికార దుర్వినియోగం వరకు తీసుకువచ్చారా..? అంటే అవుననేనే అనిపిస్తుంది. ఎందుకంటే.. డింపుల్ హయాతి వరుస ట్విట్లు ఇలానే కనిపిస్తున్నాయి. డింపుల్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘అధికారాన్ని ఉపయోగించి ఏ తప్పును ఆపలేరు’’.. ‘‘అధికార దుర్వినియోగం తప్పులను దాచదు.. సత్యమేవ జయతే’’.. అంటూ వరుస ట్విట్లలో పేర్కొన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేశారు.
Misuse of power doesn’t hide mistakes .. ? . #satyamevajayathe
— Dimple Hayathi (@DimpleHayathi) May 23, 2023
దీంతో ఐపీఎస్ ఆఫీసర్ రాహుల్ హెగ్డే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారా..? అంటే నటి మాటల్లో అవుననే అర్ధమవుతోంది. అపార్ట్‌మెంట్లో పార్కింగ్ గొడవ అనంతరం.. వారం రోజులుగా డింపుల్ కార్ పోలీసులు టార్గెట్ చేశారు. అన్ని చలాన్ లు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ పరిధిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఉదయం నుంచి వచ్చిన మీడియా కథనాలతో డింపుల్ హయాతి చలాన్లు క్లియర్ చేసుకున్నారు. గొడవ ఇద్దరి మధ్య జరిగితే.. చలాన్లు విధించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ డింపుల్ ఇన్‌డైరక్ట్‌గా ట్విట్ చేశారు. ఇది ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చర్చనీయాంశంగా మారింది.
ఈ విషయంలో లీగల్‌గా ఎదుర్కునేందుకు డింపుల్ హయాతి సిద్ధమయ్యారని కనిపిస్తోంది. ఇంకా.. విచారణలో భాగంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన సమయంలో 4 గంటల పాటు విచారణ పేరుతో కూర్చోపెట్టారని అసహనం వ్యక్తంచేశారు. దీంతోపాటు రాహుల్ హెగ్డే డ్రైవర్ పై డింపుల్ ఫిర్యాదు చేశారు. అయితే, డింపుల్ ఫిర్యాదును జూబ్లీహిల్స్ పోలీసులు స్వీకరించలేదని.. తనపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేసు పెట్టారంటూ డింపుల్ పేర్కొంటున్నారు. ఇంకా కావాలనే తన కార్ పై చాలాన్లు వేసి వేధిస్తున్నారని డింపుల్ వాపోయారు.
కాగా.. డింపుల్ హయాతి ట్విట్లపై.. రాహుల్ హెగ్డే రియాక్ట్ అయ్యారు.. కార్ అడ్డు పెట్టద్దు అని నేనే చాలా సార్లు రిక్వెస్ట్ చేశానన్నారు. రంజాన్ రోజు కూడా తన కారు అడ్డు పెట్టడంతో అది తీసేదాకా వెయిట్ చేయడంతో సౌత్ జోన్ కి వెళ్లడం ఆలస్యం అయిందని తెలిపారు. ఆ రోజు కారు అడ్డంగా పెట్టి దిగి డింపుల్ వెళ్లిపోవడంతో తమ సిబ్బందే ఆమె కార్ పక్కన పార్క్ చేశారన్నారు. ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోకుండా పోలీస్ వెహికల్ కి కాలుతో తన్ని డ్యామేజ్ చేశారని.. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో ఉన్నాయని అందుకే ఫిర్యాదు చేశానంటూ తెలిపారు. దర్యాప్తులో అన్ని నిజాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు.
ఎదిఏమైనా.. ఇటు నటి.. అటు ఐపీఎస్ ఆఫీసర్ కావొచ్చు.. తప్పు ఎవరు చేసినా.. తప్పు తప్పే.. అపార్ట్‌మెంట్‌లో ఏం జరిగింది.. ఆ ఇద్దరి మధ్య గొడవ కేసులు పెట్టేవరకు ఎందుకెళ్లింది.. చలాన్లు ఎందుకు వేశారు.. ఇదంతా తేలాల్సి ఉంది. ఈ కేసులో నటి అత్సుత్సాహమా..? లేక ఐపీఎస్ ఆఫీసర్ అధికార దుర్వినియోగమా..? అనేది మాత్రం పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..