AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి.. వానాకాలంలో మండు వేసవి పరిస్థితులు.. బయటకు రావాలంటే వణుకే

ఎండలు (Temperature) దంచి కొడుతున్నాయి. వానాకాలంలోనే ఎండాకాలం కనిపిస్తోంది. చినుకు జాడ లేకపోగా సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఉదయం పది దాటితే చాలు మండిపోతున్నాడు. వేడి..

Hyderabad: ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి.. వానాకాలంలో మండు వేసవి పరిస్థితులు.. బయటకు రావాలంటే వణుకే
Summer Effect In Raining
Ganesh Mudavath
|

Updated on: Sep 04, 2022 | 1:14 PM

Share

ఎండలు (Temperature) దంచి కొడుతున్నాయి. వానాకాలంలోనే ఎండాకాలం కనిపిస్తోంది. చినుకు జాడ లేకపోగా సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఉదయం పది దాటితే చాలు మండిపోతున్నాడు. వేడి మాత్రమే కాకుండా ఉక్కపోత కూడా తీవ్రంగా వేధిస్తోంది. గాలిలో తేమ శాతం తగ్గిపోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఆదిలాబాద్‌ జిల్లా అర్లి గ్రామంలో రాష్ట్రంలోనే (Telangana) అత్యధికంగా 39 డిగ్రీలు నమోదవ్వడం తీవ్రతకు అద్దం పడుతోంది. గత పదేళ్ల సెప్టెంబరు నెల చరిత్రలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడం గమనార్హం. సాధారణంగా సెప్టెంబర్ నెలలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 22 డిగ్రీలు ఉంటాయి. కానీ అందుకు భిన్నంగా హైదరాబాద్‌లోని కిషన్‌బాగ్‌లో 27.5 డిగ్రీలు నమోదయ్యాయి. పెరిగిన ఉష్ణోగ్రతతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రుతుపవనాల కారణంగా వాతావరణంలో మార్పులు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. హిమాలయాల వైపు వెళ్లిపోవడం, ఉపరితల ద్రోణి గానీ, ఆవర్తనం గానీ లేకపోవడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వివరిస్తున్నారు. ఆది, సోమ, మంగళవారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడ మోస్తరు వానలు పడతాయని తెలిపారు. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో పంటలపై ప్రభావం పడుతోంది. సోయా చిక్కుడు, మొక్కజొన్న, మినుము, వంటి పంటల్లో జీవం లేకుండా పోతోంది. దీంతో పంట ఉత్పత్తి తగ్గుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు.. దక్షిణ, ఆగ్నేయ దిశలో వీస్తున్న గాలులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా కోస్తాంధ్ర, యానాం, రాయలసీమల్లోని వానలు పడే అవకాశం ఉందని తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి