Hyderabad: గత్తరలేపుతున్న గలీజ్‌ వ్యవహారం.. గే డేటింగ్‌ యాప్‌ మాటున.. వామ్మో..

మనిషి మూడ్స్‌ని తెలియజేసే సింబల్స్‌ని చిత్రవిచిత్రంగా వాడేస్తున్నారు...! అది కూడా ఓ 'గే' డేటింగ్‌ యాప్‌లో డ్రగ్స్‌ కోసం వాడుతుండటం... డ్రగ్స్‌లో రకాలున్నట్లే రకరకాల మనుషులు ఆ డ్రగ్స్‌ వాడుతుండటం... అందరూ డాక్టర్లూ ఉండటం.. కన్జ్యుమర్స్‌లో కొందరికి HIV రావడం.. ఇలా ఒక్కటేంటి గలీజ్‌ దందా మాటున దాగున్న డర్టీ కంటెంట్‌ దిమ్మతిరిగేలా చేస్తోంది. యాప్‌ను ఇలా కూడా వాడతారా...! వాడేవాళ్లూ ఇలా కూడా ఉంటారా...! ఇదెక్కడి ఖర్మరా బాబూ అని అధికారులే అవాక్కయ్యేలా ఉన్నాయ్‌ వాస్తవాలు.

Hyderabad:  గత్తరలేపుతున్న గలీజ్‌ వ్యవహారం.. గే డేటింగ్‌ యాప్‌ మాటున.. వామ్మో..
Drug Case

Updated on: Sep 04, 2025 | 7:36 PM

ఫ్లైట్‌ సింబల్ పెడితే ఎక్కడికో వెళ్తున్నట్లు… కానీ అక్కడ మాత్రం దానర్థం ఐ వాంట్ అని…!  రాకెట్‌ సింబల్‌ అంటే జట్‌ స్పీడ్‌ అని మనం అనుకుంటాం… కానీ వాళ్లు మాత్రం అవైలబుల్‌ అని అర్థం చేసుకుంటారు…!  ఇక పావురం సింబల్‌ అంటే ఎగిరిపోవడమని మనకి తెలుసు… వాళ్లు మాత్రం ‘ఆన్ ద వే’ హ్యాపీగా ఫీలవుతుంటారు…! ఇలా సింబల్స్‌ని డిఫరెంట్‌గా అర్ధం చేసుకునేది ఎక్కడనుకుంటున్నారా…! గ్రిండర్‌ గే డేటింగ్‌ యాప్‌లో. యస్‌.. రకరకాల డ్రగ్స్‌ను రకరకాల మనుషులు వాడుతుండుతున్నట్లు ఈస్ట్‌ జోన్‌ పోలీసులు తేల్చారు.

కొడుకు డ్రగ్స్‌ తీసుకుంటున్నాడని… దానికో యాప్‌ను వాడుతున్నాడని ఓ తండ్రికి అనుమానం వచ్చింది…! ఆయన వెళ్లి పోలీసులకు చెప్పగా తమదైన స్టైల్‌లో ఇన్వెస్టిగేషన్‌ చేస్తే… వినడానికే ఇబ్బంది కలిగే డర్టీ పిక్చర్‌ బట్టబయలైంది. గ్రిండర్ అనే ఓ గే డేటింగ్‌ యాప్‌ ద్వారా డ్రగ్స్‌ దందా సాగుతోందని… కేవలం సింబల్స్‌ ద్వారానే ఆర్డర్ అండ్‌ డెలివరీ నడుస్తోందని… ఆ యాప్‌లో వందలాదిమంది అసహజ సంపర్కులే ఉన్నారన్న వ్యవహారం మైండ్‌ పోయేలా చేస్తోంది.

డ్రగ్స్‌ అంటేనే గలీజ్‌ వ్యవహారం… ఇంతటి డర్టీ కంటెంట్‌ ఉన్న ఈ కేసులో బయటకొచ్చిందీ మరో అసహ్యం. అదే నిందితులు, కన్జ్యుమర్స్‌లో కొందరికి HIV ఉండటం. ఇక ఈ కేసులో 10 మందిని అదుపులోకి తీసుకున్న హైదరాబాద్‌ ఈస్ట్‌ జోన్‌ పోలీసులు.. అందులో ఓ డాక్టర్ కూడా ఉన్నట్లు తేల్చారు. 100 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరుకి చెందిన ఓ నైజీరియన్ ద్వారా ఇద్దరు పెడ్లర్లు డ్రగ్స్‌ కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. గ్రాము 10వేల రూపాయలకు కొనుగోలు చేసి హైదరాబాద్‌లో 15వేల రూపాయలకు అమ్ముతున్నట్లు తెలిపారు. ఇంటర్నేషన్‌ లెవల్‌లో ఈ గ్రిండర్‌ యాప్‌ వ్యవహారం నడుస్తోందని… విచారణ ముమ్మరం చేశామన్నారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.