Foreign currency : స్వీట్ బాక్స్‌లో విదేశీ కరెన్సీ తరలింపు.. ఐడియా అదిరింది.. కానీ ఎలా దొరికాడో తెలుసా?..

Foreign currency : హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రతి రోజు ఏదో విధంగా అక్రమంగా బంగారం తరలించడం, విదేశీ కరెన్సీ, డ్రగ్స్‌ ఇలా

Foreign currency : స్వీట్ బాక్స్‌లో విదేశీ కరెన్సీ తరలింపు.. ఐడియా అదిరింది.. కానీ ఎలా దొరికాడో తెలుసా?..
Foreign Currency

Updated on: Mar 24, 2021 | 2:30 PM

Foreign currency : హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రతి రోజు ఏదో విధంగా అక్రమంగా బంగారం తరలించడం, విదేశీ కరెన్సీ, డ్రగ్స్‌ ఇలా పట్టుబడిపోతున్నాయి. అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎప్పటికప్పుడు ఎయిర్‌పోర్టులో నిఘా పెంచుతున్నారు అధికారులు. తాజాగా హైదరాబాద్ కస్టమ్స్, సిఐఎస్ఎఫ్ సమన్వయంతో దాడిలో విదేశీ కరెన్సీ పట్టుబడింది. వివరాలు ఇలా ఉన్నాయి.

దుబాయ్‌కి బయలుదేరిని ఓ ప్యాసింజర్‌ రూ.1.13 కోట్ల విదేశీ కరెన్సీ తరలిస్తుండగా కస్టమ్స్, సిఐఎస్ఎఫ్ పోలీసులకు చిక్కాడు. విచిత్రమేంటంటే ఇతగాడు స్వీట్ బాక్స్‌లో ఆ కరెన్సీని దాచి తరలించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు గమనించి స్వీట్ బాక్స్ ఓపెన్ చూసి చూడగా అందులో కరెన్సీ లభ్యమైంది. దీంతో ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ఇదిలా ఉంటే మంగళవారం కూడా ఓ కేసు నమోదైంది. హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌ వెళ్తున్న ఓ ప్రయాణికుడి వద్ద రూ.11.50 లక్షల విలువ చేసే విదేశీ కరెన్సీని కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు. లగేజీ బ్యాగులో కరెన్సీ దాచి తరలించే ప్రయత్నం చేస్తుండగా, స్కానింగ్‌లో బయట పడింది. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు కస్టమ్స్‌ అధికారులు వెల్లడించారు.

కాగా, రోజురోజుకు అక్రమ రవాణాలు ఎక్కువైపోతున్నాయి. అక్రమంగా బంగారం, కరెన్సీ ఇలా గుట్టు చప్పుడు కాకుండా విదేశాల నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి విదేశాలకు అక్రమ రవాణాలకు పాల్పడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు. కొందరైతే అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ పట్టుబడిపోతున్నారు. అలా అక్రమ కరెన్సీని తీసుకెళ్తూ పట్టుబడిపోతున్నారు. నిందితులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. చివరికి పోలీసులకు చిక్కపోతూ కటకటాల పాలవుతున్నారు.

 

PF Limits: ఉద్యోగులకు తీపి కబురు… తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో పీఎఫ్‌ జమ విషయంలో ఎంతో ఊరట..!

Saranga Dariya song: సారంగదారియా పాటకు స్టెప్పులేసి యూట్యూబ్ స్టార్.. అమ్మడి డ్యాన్స్ కు సోషల్ మీడియా షేక్

Dance Deewane Special Episode :బుల్లి తెరపై బాలీవుడ్ సీనియర్ బ్యూటీలతో సందడి చేయనున్న మాధురీ దీక్షిత్ ..

వైఎస్సార్ అనుచరుడు సూరీడుపై దాడి.. క్రికెట్ బ్యాట్‌తో కొట్టిన సొంత అల్లుడు.. కారణాలు ఇలా ఉన్నాయి..