క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్: ఐపీఎల్
హైదరాబాద్‌లోని కోఠిలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టయ్యింది. మహ్మద్ గుల్షమ్ అపార్ట్‌మెంట్‌లో బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను గుర్తించారు. ఇద్దరు బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకోగా మరో ముగ్గురు పరారయ్యారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పశ్చిమ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారిని నారాయణగూడ పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్నవారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.