COVAXIN : భారత్ బయోటెక్ కీలక ప్రకటన.. కొవాగ్జిన్ మూడోదశ క్లినికల్ ట్రయల్స్‌కు ఏర్పాట్లు.. 25,800 మంది వాలంటీర్లపై ప్రయోగం..
COVAXIN : కరోనా వ్యాక్సిన్ విషయంలో భారత్ బయోటెక్ గుడ్ న్యూస్ తెలిపింది. కరోనా వైరస్‌ను అంతం చేసేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా

COVAXIN : కరోనా వ్యాక్సిన్ విషయంలో భారత్ బయోటెక్ గుడ్ న్యూస్ తెలిపింది. కరోనా వైరస్‌ను అంతం చేసేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) పలు కంపెనీలు తయారు చేసిన వ్యాక్సిన్‌లను పరిశీలించిన సంగతి తెలిసిందే. ఇటీవల భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్ టీకాలకు పరిమితులతో కూడిన అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తొలి రెండు దశల్లో క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసిన భారత్ బయోటెక్ తాజాగా మూడోదశ క్లినికల్ ట్రయల్స్‌కు ఏర్పాట్లు చేస్తోంది. 25,800 మంది వాలంటీర్లపై వ్యాక్సిన్ ప్రయోగిస్తున్నట్లుగా వెల్లడించింది. మూడోదశలో వ్యాక్సిన్ రోగిపై ఎలా పనిచేస్తున్నది, వైరస్ బారినుంచి ఏమేరకు రోగిని టీకా రక్షించగలుగుతుందనే అంశాలపై అధ్యయనం చేస్తోంది.
కొత్తరకం కరోనా వైరస్‌పై కూడా కోవాగ్జిన్ టీకా పనిచేస్తుందని గతంలోనే భారత్ బయోటెక్ తెలిపింది. కోవాగ్జిన్ లోని ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ లోని 2 విభాగాలు ఈ కొత్తరకం వైరస్ రకాన్ని సమర్థంగా అడ్డుకుంటాయని ప్రకటించింది. కోవాగ్జిన్ పూర్తిగా దేశీయంగా రూపొందిన కోవిడ్ టీకా. భారత వైద్య పరిశోధనా మండలి, పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీల భాగస్వామ్యంతో భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్‌ను అభివృద్ధి చేస్తోంది.



