Telangana: కాక రేపుతున్న రాజకీయాలు.. అద్దంకి దయాకర్ కు షోకాజ్ నోటీసులు.. క్షమాపణలు కోరిన నేత
తెలంగాణలో (Telangana) మునుగోడు వ్యవహారం కాక రేపుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలతో నాయకుల మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై అద్దంకి దయాకర్ చేసిన కామెంట్స్ పార్టీలో సెన్సేషనల్ గా మారాయి. అద్దంకి...
తెలంగాణలో (Telangana) మునుగోడు వ్యవహారం కాక రేపుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలతో నాయకుల మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై అద్దంకి దయాకర్ చేసిన కామెంట్స్ పార్టీలో సెన్సేషనల్ గా మారాయి. అద్దంకి దయాకర్ చేసిన మాటలను పార్టీలోని సీనియర్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. దయాకర్‌కు (Addanki Dayakar) వ్యతిరేకంగా ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా కార్యకర్తలు నిరసనలు చేపడుతున్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి (Komati Reddy Venkat Reddy) క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న (శుక్రవారం) జరిగిన చండూరు సభకు హాజరు రాలేదు. అయితే దానిపై అద్దంకి దయాకర్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. కాగా.. అద్దంకి దయాకర్ మాటలపై రాజగోపాల్‌రెడ్డి సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ని తిట్టిస్తారా అని మండిపడ్డారు.
చండూరు సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అద్దంకి దయాకర్‌కు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నోటీసులు ఇచ్చింది. ప్రసంగంలో భాగంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తుండటంతో టీపీసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. షోకాస్ నోటీసులు జారీ చేసింది. అయితే.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని, క్షమించాలని కోరినట్లు సమాచారం.
ఇంతకీ నిన్నటి సభలో అద్దంకి దయాకర్ ఏమన్నారో చూద్దాం.