AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పంద్రాగస్టు కానుక ప్రకటించిన సీఎం కేసీఆర్.. మరో 10 లక్షల మందికి.. అంతే కాకుండా

తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో 57 సంవత్సరాలు నిండిన, అర్హత కలిగిన వారందరికీ ఆగస్టు 15 నుంచి పింఛన్లు అందజేయనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 36 లక్షల పింఛన్లు ఉన్నాయని...

Telangana: పంద్రాగస్టు కానుక ప్రకటించిన సీఎం కేసీఆర్.. మరో 10 లక్షల మందికి.. అంతే కాకుండా
Cm Kcr
Ganesh Mudavath
|

Updated on: Aug 06, 2022 | 7:27 PM

Share

తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో 57 సంవత్సరాలు నిండిన, అర్హత కలిగిన వారందరికీ ఆగస్టు 15 నుంచి పింఛన్లు అందజేయనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 36 లక్షల పింఛన్లు ఉన్నాయని, 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు (Independence Day Celebrations) సందర్భంగా మరో 10 లక్షల మందికి పింఛన్లు అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15 నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉంటుందని, బార్‌కోడ్‌తో కూడిన కొత్త పింఛను కార్డులు అందిస్తామని వివరించారు. అంతే కాకుండా ఇండిపెండెన్స్ డే సందర్భంగా సత్ర్పవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని జైళ్లశాఖను ఆదేశించామని పేర్కొన్నారు. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. దేశంలో అన్ని రకాల వస్తువులపై జీఎస్టీ విధించారని, తద్వారా ప్రజలు ధరలభారం మోయలేకపోతున్నారని వెల్లడించారు. పాలమీద జీఎస్టీ రద్దు చేయాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు.

28 శాతం జీఎస్టీ వల్ల బీడీ కార్మికులు ఉపాధి కోల్పోయారు. చేనేతపై విధించిన జీఎస్టీని తొలగించాలి. గాలి మీద తప్ప అన్నింటిపైనా పన్ను వేస్తున్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులపై ఆంక్షలు విధించారు. ఈ అంశంపై నీతి ఆయోగ్‌లో ఎందుకు ప్రస్తావించరు. రాష్ట్రాలు బలహీనంగా ఉంటే కేంద్రం కూడా బలహీనంగానే ఉంటుంది. గత ప్రభుత్వాల సంక్షేమ చిహ్నాలను చెరిపేసే ప్రయత్నాలు చేస్తున్నారు. నీతి ఆయోగ్‌ సమావేశంలో చెబితే.. గోడకు చెప్పినట్టే. అందుకే నిరర్థకమైన నీతిఆయోగ్‌ సమావేశంలో పాల్గొనదల్చుకోలేదు.

 – కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి

ఇవి కూడా చదవండి

మరోవైపు.. కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థలను జేబు సంస్థలుగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. దేశ చరిత్రను మలినం చేస్తున్నారని, మహాత్మా గాంధీకి లేని అవలక్షణాలను అంటగడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్డీయే పాలనలో కుంభకోణం నడుస్తోందని, వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ ఇస్తే ఉచితమా? అని ప్రశ్నించారు. ఉచితాలు తప్పు అయితే, ఎన్‌పీఏలకు ఎందుకు ఇస్తున్నారని నిలదీశారు. మాంజా, బ్లేడ్లు, నెయిల్ కట్టర్లు, జాతీయ జెండాలు సైతం చైనా నుంచి దిగుమతి చేస్తున్నారు. మేకిన్ ఇండియా అంటే ఇదేనా అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..