Telangana: మోదీ-కేసీఆర్ ఒక్క తాను ముక్కలే.. సంచలన కామెంట్స్ చేసిన రేవంత్

Telangana: నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ ప్రభుత్వం బహిష్కరించడంపై టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. నీతి ఆయోగ్ సమావేశాన్ని..

Telangana: మోదీ-కేసీఆర్ ఒక్క తాను ముక్కలే.. సంచలన కామెంట్స్ చేసిన రేవంత్
Revanth Reddy
Follow us

|

Updated on: Aug 06, 2022 | 7:51 PM

Telangana: నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ ప్రభుత్వం బహిష్కరించడంపై టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడాన్ని తప్పుపట్టారు. ఈ సమావేశానికి వెళ్లడం ద్వారా తెలంగాణకు జరిగిన నష్టాన్ని కేసీఆర్ ప్రశ్నిస్తారని అనుకున్నామన్నారు. కానీ, సమావేశాన్ని బహిష్కరించడం ద్వారా కేసీఆర్-మోదీ చీకటి సంబంధాన్ని నిరూపించుకున్నారని విమర్శించారు. ఏడున్నరేళ్లుగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని కేసీఆర్ సమర్థించారని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి.. మోడీ – కేసీఆర్ ఒక్కరేనని అన్నారు. కేసీఆర్ మాటలు వినిపిస్తున్నాయి కానీ, చేతలు మాత్రం కనిపించడం లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో అక్రమాలు అవినీతి ఉంటే.. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, యాంటీ కరప్షన్ బ్యూరో వంటి వ్యవస్థలతో విచారణ జరిపించాలన్నారు. కానీ, ఈ రాజ్యాంగబద్ధ సంస్థలను ప్రత్యర్థులను అణచివేసేందుకే ఉపయోగిస్తున్నారని కేంద్రంపై ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి.

జాతీయస్థాయిలో నరేంద్ర మోడీ సిబిఐ, ఈడి, ఇన్కమ్ టాక్స్ వంటి సంస్థలను ఎలాగైతే రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్నారో, అదే మాదిరిగా తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర దర్యాప్తు సంస్థలను వినియోగిస్తున్నారని విమర్శించారు రేవంత్. మోడీకి కేసీఆర్ ఏకలవ్య శిష్యుడు అని అభివర్ణించారు. మోడీ- కెసిఆర్ ఒక తాను ముక్కలే అని విమర్శించారు. నరేంద్ర మోడీ ప్రతిపక్షాల సలహాలు సూచనలు వినడం లేదని కేసీఆర్ అంటున్నారని, మరి రాష్ట్రంలో కేసీఆర్ ఏమైనా ప్రతిపక్షం చేసిన సూచనలు అమలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు.

ఆదివారం నాడు ఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులను ఎందుకు ఇవ్వడం లేదో నిలదీయాలన్నారు. చట్టబద్ధంగా తెలంగాణకు రావలసినవాటిని సాధించాలని సూచించారు. లేదంటే.. నరేంద్ర మోదీకి లొంగిపోయినట్లుగానే తాము భావిస్తామన్నారు. తెలంగాణ ప్రజల ఆలోచనలు, భావాలను ప్రధాని మోడీకి వినిపించే అవకాశాన్ని చేజార్చడాన్ని తెలంగాణ సమాజం హర్షించదన్నారు.

ఇవి కూడా చదవండి

పార్టీ మారుతున్న నేతలకు స్ట్రాంగ్ కౌంటర్.. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడుతున్న నేతలపైనా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు రేవంత్ రెడ్డి. కష్ట కాలంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలపై పోరాడుతున్నది ఎవరో, వ్యాపార ప్రయోజనాలతో పనిచేస్తున్నది ఎవరో సమాజం గుర్తిస్తుందన్నారు. చిల్లర వేషాలు వేసే వాళ్లను ఇంకా కొంతమందిని వారు తయారు చేయవచ్చునని, కొన్ని అనుభవంలోకి వస్తేనే తెలుస్తుందన్నారు. ఇప్పుడు వారు చేరుదామనుకున్న పార్టీలో కండువా కప్పుకున్న రోజే పండుగ అని వ్యాఖ్యానించారు. ఇదివరకు పార్టీలో చేరిన కొందరు ఎలాంటి అనుభవాలకు గురయ్యారో, ఎలా బయటికి వచ్చారో అందరూ చేశారని అన్నారు. ఒక పోలీస్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ సివిల్స్ ర్యాంకు కొట్టి ఐపీఎస్ అధికారి అయ్యి అదే జిల్లాకు ఎస్పీగా వస్తే – నాకంటే జూనియర్ ఎస్పీ సీట్ల ఎలా కూర్చుంటారు అని ప్రశ్నిస్తే ఎలా ఉంటుందో.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయని రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

బీజేపీలో బండి సంజయ్ పరిస్థితి ఏంటో తెలియదా.. ఇప్పటివరకు బీజేపీలో ఎంతమంది చేరారో, ఎంతమంది బయటకు వచ్చారో లెక్కలు తీయాలని రేవంత్ రెడ్డి అన్నారు. జులై 7, 2021న ఛార్జ్ తీసుకున్నానని, అప్పటినుంచి కాంగ్రెస్ పార్టీలో వచ్చింది నూతన ఉత్సాహమా? కాదా? అన్నది విశ్లేషించుకోవాలని పార్టీ నేతలను కోరారు. బీజేపీలో చేరిన వారికి మూడు నాలుగు నెలల్లోనే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతుందన్నారు. బీజేపీలో బండి సంజయ్ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసునని అన్నారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై.. ఝార్ఖండ్ లో కోల్ ఇండియా సంస్థకు చెందిన మైన్, రైల్వే కాంట్రాక్టులు వచ్చాయా రాలేదా చెప్పండి అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇవన్నీ వారి కంపెనీ సమర్థత చూసే వచ్చాయా? అని ప్రశ్నించారు. 2009లో నేరుగా పార్టీలోకి వచ్చి ఎంపీకి నామినేషన్ వేశారా? లేదా? అని ప్రశ్నించారు. అంతకుముందు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారా? అని నిలదీశారు రేవంత్ రెడ్డి. పార్టీని నమ్ముకున్న వారిని కాదని, రాజగోపాల్ రెడ్డికి నాడు టికెట్ ఇవ్వడం జరిగిందని, అలాంటి వ్యక్తి నేడు పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్తున్నారని అన్నారు. హిందూ మహాసభ, జన్ సంఘ్ సమయం నుంచి బిజెపి కోసం పని చేస్తున్న కార్యకర్తలు ఆ నియోజకవర్గంలో ఉన్నారని అన్నారు. వారిని కాదని నువ్వు పోటీలో నిలబడతావా? అంటూ రాజగోపాల్ రెడ్డిని ప్రశ్నించారు రేవంత్. రాహుల్, సోనియా గాంధీని జైల్లో పెట్టాలని కుట్ర చేస్తున్న సమయంలో నువ్వు ఎక్కడ ఉన్నావు? అంటూ రాజగోపాల్ రెడ్డిని ప్రశ్నించారు. నాయకత్వానికి అండగా నిలబడాల్సిన సమయంలో బాధ్యత కలిగిన వ్యక్తిగా సోనియాకు అండగా నిలబడతారా? లేక కుట్ర చేస్తున్న అమిత్ షా పక్కన చేరతారా? అని నిలదీశారు.

అద్దంకి వ్యాఖ్యలు తప్పు.. చండూరు సభలో ఎంపీ కోమటిరెడ్డి వెకంట్ రెడ్డిపై అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అద్దంకి దయాకర్ ఆ తరహా పదజాలాన్ని ఉపయోగించడం తప్పు అన్నారు. శత్రవైనా సరే అలాంటి పదజాలాన్ని కాంగ్రెస్ సమర్థించదన్నారు. క్షణికావేశానికి గురైనా, ఉద్దేశపూర్వకంగా అన్నా అది ముమ్మాటికీ తప్పేనని అన్నారు. దీనిపై పార్టీలో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..