అడ్డగోలు అప్పులు, హద్దులేని వడ్డీలతో ఖజానాకు లాస్.. తెలంగాణ అప్పులపై సీఎం రేవంత్ ప్రకటన
ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏంటి? రాష్ట్రానికి ఉన్న అప్పులెన్ని? కట్టాల్సిన వడ్డీ ఎంత? రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత? ఆ ఆదాయం ఎటుపోతుంది? ఈ ప్రశ్నల చుట్టూ తెలంగాణ రాజకీయం ఎప్పుడూ హీటెక్కుతూనే ఉంటుంది. అయితే తెలంగాణ అప్పులపై రేవంత్ రెడ్డి కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఇటు పాలనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టారు.

తెలంగాణ రాజకీయాల్లో అప్పులపై ఎప్పటికప్పుడు అధికార విపక్షాల మధ్య పొలిటికల్ నడుస్తూనే ఉంటుంది. బీఆర్‌ఎస్ హయాంలో పదేళ్ల కాలంలో చేసిన అప్పులపై, ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాష్ట్రాన్ని గత పదేళ్లు పాలించి కేసీఆర్.. అప్పులపాలు చేశారని పదే పదే విమర్శించే సీఎం రేవంత్ రెడ్డి సైతం తన పాలనలో అప్పులు చేయక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆర్థిక అవసరాలను చక్కబెట్టడంతో పాటు ఆర్థిక స్థిరీకరణ కోసమే అప్పులు చేస్తున్నామని… అయితే అడ్డగోలు అప్పులు, హద్దులేని వడ్డీలతో ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని.. ఇప్పుడు ఎక్కడ అప్పు పుట్టడం లేదన్నారు రేవంత్. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేందుకూ రూపాయి లేదని అన్నారు.
కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క హామీ అమలు కాలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. వెసులుబాటు ఇవ్వండి.. అన్నీ సెట్ చేస్తామన్నారు. 11% వడ్డీలను 4,5 శాతానికి తగ్గిస్తున్నామని తెలిపారు. మొత్తంగా అప్పులు, హామీల అమలుపై జరుగుతున్న రాజకీయ విమర్శలకు రేవంత్ చెక్ పెట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.