మహిపాల్ దంపతులకు సీఎం కేసీఆర్ అభినందనలు.. ముఖ్యమంత్రికి టమాటాల బుట్టను బహుమతిగా ఇచ్చిన రైతు..
Hyderabad: రూ. 3 కోట్ల విలువైన టమోటా పంటను పండించిన మెదక్ జిల్లా రైతు బాన్సువాడ మహిపాల్ రెడ్డి దంపతులను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డితో కలిసి సెక్రటేరియట్‌లో సీఏం కేసీఆర్‌ని రైతు మహిపాల్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి..
Hyderabad: రూ. 3 కోట్ల విలువైన టమోటా పంటను పండించిన మెదక్ జిల్లా రైతు బాన్సువాడ మహిపాల్ రెడ్డి దంపతులను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డితో కలిసి సెక్రటేరియట్‌లో సీఏం కేసీఆర్‌ని రైతు మహిపాల్ రెడ్డి కలిశారు. సీఎం కేసీఆర్‌ని కలిసిన సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే రూ.2 కోట్ల విలువైన టమాటా పంటను విక్రయించానని, ఇంకో రూ. కోటి రూపాయల విలువైన పంట కోతకు సిద్ధంగా ఉందని వివరించారు. వాణిజ్య పంటల సాగు విషయంలో రైతులు వినూత్నంగా ఆలోచిస్తే ఎంతో లాభదాయకంగా ఉంటుందని మహిపాల్ రెడ్డికి కేసీఆర్ సూచించారు. ఇంకా మహిపాల్ రెడ్డి దంపతులను సీఎం కేసీఆర్ సన్మానించారు. ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి దంపతులు టమాటాల బుట్టను సీఎం కేసీఆర్‌కి బహుమతిగా ఇచ్చారు.
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్‌నగర్‌కు చెందిన మహిపాల్‌రెడ్డి తనకున్న పొలంతో పాటు కొంత భూమిని కౌలుకు తీసుకుని కూరగాయలు సాగు చేస్తుంటారు. జూన్, జూలై నెలల్లో టమాటాకు మంచి ధర ఉంటుందని గ్రహించి ముందుగానే పది ఎకరాల్లో టమాట పంటను వేశారు. అనుకున్నట్లుగానే టమాటా ధరలు పెరగడంతో మహిపార్ రెడ్డికి అనుకున్నదాని కంటే ఎక్కువ మొత్తంలో లాభాలు వచ్చాయి.
మూడు కోట్ల రూపాయల విలువైన టమాటా పంట పండించిన మెదక్ జిల్లా, కౌడిపల్లి మండలం, మహ్మద్ నగర్ కు చెందిన రైతు శ్రీ బాన్సువాడ మహిపాల్ రెడ్డి దంపతులను ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ అభినందించారు. ఈరోజు నర్సాపూర్ ఎమ్మెల్యే శ్రీ చిలుముల మదన్ రెడ్డితో వచ్చిన రైతు మహిపాల్ రెడ్డి సెక్రటేరియట్ లో… pic.twitter.com/R6XjdotTQM
— Telangana CMO (@TelanganaCMO) July 24, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..