Hyderabad: హైదరాబాదీలు బీ అలెర్ట్.. వాతావరణంలో తీవ్ర మార్పులు.. గతంలో ఎప్పుడూ లేనంతగా..

ఫిబ్రవరి లో హైదరాబాద్ నగర వాతావరణం లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఏకకాలంలో ఎండ, మేఘావృతమైన వర్షాలు, చలికాలం వంటి పరిస్థితులు ఏర్పడనున్నాయి. గతంలో ఎన్నడూ కనిపించని ఈ తరహా మార్పులు ప్రజల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Hyderabad: హైదరాబాదీలు బీ అలెర్ట్.. వాతావరణంలో తీవ్ర మార్పులు.. గతంలో ఎప్పుడూ లేనంతగా..
Weather

Edited By:

Updated on: Jan 28, 2025 | 11:54 AM

హైదరాబాద్‌లో సగటు ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల సెల్సియస్ పరిధిలో ఉంటాయి. అయితే, ఇటీవల జనవరి మధ్యకాలం నుంచి వీటిలో గణనీయమైన హెచ్చుతగ్గులు చోటుచేసుకున్నాయి. ఉదాహరణకు, జనవరిలో ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయాయి. ఏప్రిల్ నాటికి ఉష్ణోగ్రత 36-34 డిగ్రీల మధ్యకు చేరుకుంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. గడిచిన 5 సంవత్సరాలతో పోలిస్తే ఫిబ్రవరిలో వచ్చిన వాతావరణ మార్పులు చాలా క్లిష్టంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. జనవరిలోనే హైదరాబాద్ చల్లగా ఉంటుంది. ప్రతి ఏడాది జనవరిలో సగటున ఉష్ణోగ్రతలు 15.6 నుండి 28.5 వరకు నమోదు అవుతాయి. 2022లో జనవరిలో 12° సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. 2020 లో 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. ఒక 2015 జనవరిలో మాత్రం 34 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఈ సంవత్సరం వాతావరణ మార్పులు ప్రకృతిపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని తెలుస్తోంది. ముఖ్యంగా, హైదరాబాదులో విపరీతమైన వేడిగాలులు, వర్షాలు కనిపించవచ్చు. వాతావరణ మార్పులతో పర్యావరణం, పై నా ప్రతికూల ప్రభావం పడనుంది. .పర్యావరణ నిపుణులు గమనించిన విధంగా, క్లైమేట్ మార్పుల వల్ల హైదరాబాద్ వంటి నగరాల్లో కాలుష్యం అధికమవుతోంది. ఇది ప్రజలలో శ్వాస సంబంధిత వ్యాధులు ఎక్కువ అవ్వడానికి కారణమవుతోంది.

కాగా ఫిబ్రవరి 15 వరకు వాతావరణంలో భిన్న పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ సంచాలకులు నాగరత్నమ్మ తెలిపారు. ఒక్కొక్కప్పుడు చల్లగాలులు, మరొక్కప్పుడు వేడిగాలులు వీస్తాయన్నారామె. ఇక ఫిబ్రవరి 15 తర్వాత వేడి తీవ్రత పెరుగుతుందని, నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని ఆమె హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

 

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..