Hyderabad: హైదరాబాద్‌లో చిన్నారుల కిడ్నాప్‌ గ్యాంగ్.. ఆటోలో వచ్చి అపహరణ.. పోలీసుల అప్రమత్తతతో..

|

Jun 04, 2023 | 10:00 AM

Hyderabad News: హైదరాబాద్‌లో కిడ్నాప్‌ ముఠా గుట్టురట్టయింది. ప్యారడైస్ ఫూట్ పాత్ దగ్గర కిడ్నాప్‌ అయిన రెండేళ్ల చిన్నారి ఆచూకీని పోలీసులు గుర్తించారు. తెల్లవారుజామున 4 గంటలకు పాప కిడ్నాప్‌ అయినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది.

Hyderabad: హైదరాబాద్‌లో చిన్నారుల కిడ్నాప్‌ గ్యాంగ్.. ఆటోలో వచ్చి అపహరణ.. పోలీసుల అప్రమత్తతతో..
Hyderabad Police
Follow us on

Hyderabad News: హైదరాబాద్‌లో కిడ్నాప్‌ ముఠా గుట్టురట్టయింది. ప్యారడైస్ ఫూట్ పాత్ దగ్గర కిడ్నాప్‌ అయిన రెండేళ్ల చిన్నారి ఆచూకీని పోలీసులు గుర్తించారు. తెల్లవారుజామున 4 గంటలకు పాప కిడ్నాప్‌ అయినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన నాలుగు బృందాలు.. కిడ్నాపర్లను పట్టుకున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆటోను గుర్తించి దంపతులను అదుపులోకి తీసుకున్నారు. దంపతుల దగ్గర కిడ్నాప్‌ అయిన పాపతో పాటు మరో చిన్నారిని కూడా గుర్తించారు.

ఉదయం 4గంటలకు ప్యారడైస్ ఫుట్‌పాత్ వద్ద నిద్రిస్తున్న చిన్నారిని ఆటోలో వచ్చి కిడ్నాప్ చేసినట్లు ఫిర్యాదు అందిందని.. మహంకాళి ఏసీపీ రమేష్ తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆటోను గుర్తించి దంపతులను అదుపులోకి తీసుకున్నామన్నారు. కిడ్నాప్ కు గురైన చిన్నారి క్షేమంగా ఉందని తెలిపారు. అయితే, వారి వద్ద మరో చిన్నారిని గుర్తించామని.. సుల్తాన్ బజార్ బొగ్గులుకుంటలో శివ అనే బాలుడిని కిడ్నాప్ చేసినట్లు తెలిపారు.

దంపతుల అరెస్ట్‌తో కిడ్నాప్‌ లింక్స్‌ బయటపడుతున్నాయి. ఫుట్‌పాత్‌పై నిద్రించే చిన్నారులను టార్గెట్‌ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్నారులను కిడ్నాప్ చేసి ఎవరికి విక్రయిస్తున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కిడ్నాప్ తర్వాత చిన్నారులను అమ్ముతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతకుముందు వీరు ఎన్ని కిడ్నాప్ లు చేశారు. కిడ్నాప్ లకు ముందు ఎవరెవరినీ సంప్రదించారు.. అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..