Hyderabad: చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద పటిష్ఠ భద్రత.. చార్మినార్ చుట్టూ పికెటింగ్

| Edited By: Anil kumar poka

Jul 01, 2022 | 4:31 PM

హైదరాబాద్‌లో (Hyderabad) జరిగే బీజేపీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, బహిరంగసభ దృష్ట్యా నగరవ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని పలువురు వీఐపీలు...

Hyderabad: చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద పటిష్ఠ భద్రత.. చార్మినార్ చుట్టూ పికెటింగ్
Charminar Bhagyalaxmi Templ
Follow us on

హైదరాబాద్‌లో (Hyderabad) జరిగే బీజేపీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, బహిరంగసభ దృష్ట్యా నగరవ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని పలువురు వీఐపీలు దర్శించుకున్నారు. ఇంకా దర్శించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో చార్మినార్ (Charminar) వద్ద పోలీసులు పటిష్ఠ పహారా కాస్తున్నారు. ఈ రోజు శుక్రవారం కావడంతో పోలీసులు బందోబస్తును అధికం చేశారు. బీజేపీ కార్యవర్గ సమావేశం నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. జూలై 2, జులై 3 తేదీల్లో జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర కార్యకర్తలు పాల్గొంటారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు సయ్యద్ జాఫర్ ఇస్లాం గురువారం బహదూర్‌పురా అసెంబ్లీ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ హాజరయ్యారు.

కాగా.. రెండు రోజులుగా చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించుకుంటున్న ప్రముఖలు సంఖ్య పెరుగుతోంది. దీంతో పోలీసులు అప్రమత్తమై చార్మినార్ చుట్టూ పికెట్లు ఏర్పాటు చేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రముఖులు వస్తున్నారన్న విషయం తమకు తెలియదని, సోషల్ మీడియాలో అందిన సమాచారంతో భద్రత ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

 తెలంగాణ వార్తల కోసం..