మిస్ కాదు ఇక నుంచి మిస్టర్.. ట్రాన్స్ జెండర్‎గా మారిన సివిల్స్ అధికారి..

హైదరాబాద్ కు చెందిన ఒక సివిల్ సర్వీస్ అధికారి తన పేరును ఎం అనసూయ బదులు ఎం అనుకతిర్ సూర్యగా మార్చుకున్నారు. తాను ఆడ లింగం నుంచి పురుష లింగంలోనికి మారాలని భావించారు. ఆదే క్రమంలో ఉద్యోగం సాధించినప్పుడు అనసూయగా ఉన్న పేరును ప్రస్తుతం ట్రాన్స్ జెండర్ గా రూపాంతరం చెందిన తరువాత అనుకతిర్ సూర్యాగా మార్చాలని కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థనను ఉంచారు. స్త్రీ నుంచి పురుషునిగా మారిన అతని అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.

మిస్ కాదు ఇక నుంచి మిస్టర్.. ట్రాన్స్ జెండర్‎గా మారిన సివిల్స్ అధికారి..
Irs Officer
Follow us

|

Updated on: Jul 10, 2024 | 1:26 PM

హైదరాబాద్ కు చెందిన ఒక సివిల్ సర్వీస్ అధికారి తన పేరును ఎం అనసూయ బదులు ఎం అనుకతిర్ సూర్యగా మార్చుకున్నారు. తాను ఆడ లింగం నుంచి పురుష లింగంలోనికి మారాలని భావించారు. ఆదే క్రమంలో ఉద్యోగం సాధించినప్పుడు అనసూయగా ఉన్న పేరును ప్రస్తుతం ట్రాన్స్ జెండర్ గా రూపాంతరం చెందిన తరువాత అనుకతిర్ సూర్యాగా మార్చాలని కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థనను ఉంచారు. స్త్రీ నుంచి పురుషునిగా మారిన అతని అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని కస్టమ్స్ ఎక్సైజ్ తో పాటూ సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యూనల్ ఆఫీసులో జాయింట్ కమిషనర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. దేశ చరిత్రలోనే ఇది తొలిసారిగా కొత్త చరిత్రను సృష్టించారు ఈ సివిల్ సర్వీస్ అధికారి. ఇప్పటి వరకూ ఎవరూ చూడని, వినని సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. ఆయన ఆయన అభ్యర్థనను కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదిస్తూ కీలక ఉత్తర్వులు వెలువరించింది.

కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో ఆమె పేరు ముందు ఉన్న మిస్ కాస్త మిస్టర్ గా మారనుంది. ప్రతి సర్టిఫికేట్లో కూడా మిస్ బదులు మిస్టర్ గా మార్చుకోవాల్సి ఉంటుంది. తమిళనాడుకు చెందిన ఈ ఐఆర్ఎస్ అధికారి అనుకతిర్ సూర్య చెన్నైలోనే బాల్యం విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఇక గ్యాడ్యూయేట్ విద్యను మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌ లో గ్రాడ్యూయేట్ పట్టా పొందారు. అలాగే 2023 సంవత్సరంలో భోపాల్ లోని నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్ యూనివర్సిటీ నుంచి సైబర్ లా అండ్ సైబర్ ఫోరెన్సిక్స్‌లో పీజీ డిప్లొమా పూర్తి చేశారు. ఆ తరువాత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సి అండ్ ఐటిలో తొలిసారి తన వృత్తిలోకి అడుగు పెట్టారు. కెరియర్ ప్రారంభంలో అసిస్టెంట్ కమీషనర్‌గా బాధ్యతలు స్వీకరిచారు. ఆ తరువాత 2018లో డిప్యూటీ కమిషనర్‌గా పదోన్నతి పొందారు. 2023లో అనుకతిర్ హైదరాబాద్‌లోని CESTAT (కస్టమ్స్, ఎక్సైజ్, సర్వీస్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్)లో పదవీ బాధ్యతలు స్వీకరించి ప్రస్తుతానికి అందులోనే కొనసాగుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..