Hyderabad: ఎంజీబీఎస్ లో బాలుడు కిడ్నాప్.. సీసీ ఫుటేజీలో దృశ్యాలు నిక్షిప్తం

|

May 11, 2022 | 8:47 AM

హైదరాబాద్(Hyderabad) ఎంజీబీఎస్(MGBS) లో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. స్వగ్రామానికి వెళ్లేందుకు బస్ స్టేషన్ కు వచ్చిన బాలుడిని గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు. ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా లక్కీరెడ్డిపల్లి గ్రామానికి...

Hyderabad: ఎంజీబీఎస్ లో బాలుడు కిడ్నాప్.. సీసీ ఫుటేజీలో దృశ్యాలు నిక్షిప్తం
Kidnap
Follow us on

హైదరాబాద్(Hyderabad) ఎంజీబీఎస్(MGBS) లో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. స్వగ్రామానికి వెళ్లేందుకు బస్ స్టేషన్ కు వచ్చిన బాలుడిని గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు. ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా లక్కీరెడ్డిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మణ్‌ దంపతులు కూలీ పని చేసుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లాలోని బాలాపూర్‌ మండలం రంగనాయకుల ప్రాంతానికి ఉపాధి కోసం వచ్చారు. అక్కడే ఉంటూ స్థానికంగా పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి కవల పిల్లలు సంతానం కాగా వారిలో ఒకరు అమ్మాయి, మరొకరు అబ్బాయి. కుమార్తెను తండ్రి ఇటీవలే స్వగ్రామానికి పంపించాడు. ఈ క్రమంలో సొంతూరికి వెళ్లిన కూతురిని తిరిగి తమ వద్దకు తెచ్చుకునేందుకు తండ్రి తన కుమారుడు నవీన్‌ను తీసుకుని రాత్రి పదిన్నర గంటలకు ఎంజీబీఎస్‌కు చేరుకున్నాడు. కుమారుడిని 44వ నెంబరు ఫ్లాట్‌ఫారం వద్ద నిల్చోబెట్టి శౌచాలయానికి వెళ్లాడు. తిరిగి వచ్చి చూసేసరికి బాలుడు కనిపించలేదు. పరిసరాల్లో ఆరా తీసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో అఫ్జల్‌గంజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. బాలుడ్ని గుర్తుతెలియని వ్యక్తి తీసుకుని వెళ్తున్నట్లు సీసీ ఫుటేజీలో దృశ్యాలు లభించాయి. అతడిని పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

ఇవి కూడా చదవండి

Sambar: సాంబార్ రుచిగా ఉండాలంటే ఏం చేయాలి.. ఇంట్లో ఇలా తయారు చేసి చూడండి..!

IPL 2022: గుజరాత్‌ టైటాన్స్‌ నెంబర్‌వన్‌.. ప్లే ఆఫ్‌లో చేరిన మొదటి జట్టు..