Telangana: గుడ్ న్యూస్‌.. హైదరాబాద్‌లో BOSCH! త్వరలో 3 వేల మందికి ఉపాధి అవకాశాలు..

ప్రఖ్యాత జర్మన్ మల్టీ నేషనల్ కంపెనీ (German MNC) బాష్ హైదరాబాద్‌ (Hyderabad)నగరంలో బాష్ (Bosch) గ్లోబల్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్, ఆర్ అండ్ డి ఏర్పాటు చేయడానికి ఎంపిక చేసుకుంది. దీని ద్వారా 3000 ఉద్యోగావకాశాలు..

Telangana: గుడ్ న్యూస్‌.. హైదరాబాద్‌లో BOSCH! త్వరలో 3 వేల మందికి ఉపాధి అవకాశాలు..
Ktr 1
Follow us

|

Updated on: Feb 08, 2022 | 6:05 PM

Bosch in Hyderabad: తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌కు అరుదైన అవకాశం దక్కింది. ప్రఖ్యాత జర్మన్ మల్టీ నేషనల్ కంపెనీ (German MNC) బాష్ హైదరాబాద్‌ (Hyderabad)నగరంలో బాష్ (Bosch) గ్లోబల్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్, ఆర్ అండ్ డి ఏర్పాటు చేయడానికి ఎంపిక చేసుకుంది. ఈ విషయాన్ని పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు మంగళవారం ట్విట్టర్‌లో స్వయంగా తెలియజేశారు. తాజా ప్రతిపాదనతో దాదాపు 3000 మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. జర్మన్ ఎమ్‌ఎన్‌సీ కంపెనీ అయిన మొబిలిటీ, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ అండ్‌ హోమ్‌ అప్లియాన్సెస్‌లో ప్రపంచ అగ్రగామిగా పేరుగాంచింది. ఈ అంతర్జాతీయ సంస్థ బాష్ గ్లోబల్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ అండ్‌ ఆర్‌, డీని హైదరాబాద్‌ను స్టార్టజిక్ లొకేషన్ గా ఎంచుకుంది. తాజా నిర్ణయంతో త్వరలో హైదరాబాద్ లో బోష్ సెంటర్ ప్రారంభం కానుంది. ఈ సంస్థ ద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు.

Also Read:

GATE 2022: గేట్‌ 2022 ఫలితాల ప్రకటన తేదీ ఇదే! ఆన్సర్‌ కీ ఎప్పుడు విడుదలవుతుందంటే..