Fish Medicine: ఆస్తమా బాధితులకు పండగలాంటి శుభవార్త..! చేప మందు ప్రసాదం పంపిణీకి ముహూర్తం ఖరారు.. ఎప్పటి నుంచంటే..?

|

May 24, 2023 | 7:50 AM

Fish Medicine: ఆస్తమా బాధితులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీ తేదీని బత్తిన బ్రదర్స్ ఖరారు చేశారు. జూన్ 9వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో చేప మందు పంపిణీ చేయనున్నారు. కోవిడ్‌తో గత మూడేళ్లుగా ఈ ఆచారానికి బ్రేక్‌ పడింది. చేప ప్రసాదం పంపిణీపై మంత్రి తలసాని అధికారులతో సమీక్ష నిర్వహించారు. పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు...

Fish Medicine: ఆస్తమా బాధితులకు పండగలాంటి శుభవార్త..! చేప మందు ప్రసాదం పంపిణీకి ముహూర్తం ఖరారు.. ఎప్పటి నుంచంటే..?
Fish Medicine
Follow us on

Fish Medicine: ఆస్తమా బాధితులకు గుడ్ న్యూస్.. కరోనా కారణంగా మూడేళ్లుగా నిలిచిపోయిన చేప ప్రసాదం పంపిణీని వచ్చేనెల జూన్ 9వ తేదీన బత్తిని బ్రదర్స్ పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేయనున్నట్లు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అంతకముందు సచివాలయంలో మంత్రి తలసానితో బత్తిన సోదరులు సమావేశమై, చేపప్రసాదం పంపిణీ, ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు.

సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రతి ఏటా చేప పంపిణీకి ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని చెప్పారు. చేప ప్రసాదం కోసం ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి లక్షలాది మంది వస్తారన్న మంత్రి..ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. అవసరమైన చేప పిల్లలను మత్స్య శాఖ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. ఈ నెల 25 న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. ఇంకా జూన్ 9వ తేదీ ఉదయం 8గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బత్తిని సోదరులు తెలిపారు. సుమారు ఐదు లక్షల మంది ఈ ప్రసాదం కోసం వచ్చే అవకాశం ఉందన్నారు.

కాగా, హైదరాబాద్‌లో నివాసం ఉండే బత్తిని హరినాథ్ గౌడ్ కుటుంబీకులు 173 సంవత్సరాలుగా చేప మందు ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఉబ్బసాన్ని తగ్గించడంతో పాటు.. శ్వాస సంబంధిత రోగాల నుంచి ఈ మందు ఉపశమనం కలిగిస్తుందని.. రోగులు నమ్ముతున్నారు. ఈ మందుకు ఏటికేడు ఆదరణ పెరుగుతుందే కానీ.. ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే కరోనా కారణంగా మూడేళ్లు చేప ప్రసాదం పంపిణీ నిలిపివేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి.