Mutton Prices: మాంసం ప్రియులకు పండుగే పండగ.. కేవలం రూ.550కే కేజీ మటన్.. రీజన్ ఇదే..
కేజీ మటన్ దాదాపు రూ.800 వరకు ఉంటుంది. కానీ రూ.550కే వస్తే. అవును హైదరాబాద్‌లో కేజీ మటన్ కేవలం రూ.500కే అందిస్తున్నారు వ్యాపారులు. అంబర్‌పేటలోని గోల్నాక కబేలా వద్ద బయట ధరలతో పోలిస్తే రూ.300 తగ్గించి మటన్ విక్రయిస్తున్నారు. కారణం ఏంటంటే..

Chicken Prices: ఆదివారం వచ్చిందంటే చాలు.. హైదరాబాద్‌లో చికెన్, మటన్ షాపులు కిక్కిరిసి కనిపిస్తాయి. ఎక్కడ బట్టినా మాంసం షాపుల ముందు జనాలు ఎగబడుతూ ఉంటారు. ఆదివారం సెలవు కావడంతో మిగతా రోజులతో పోలిస్తే మాంసం ఎక్కువగా తింటూ ఉంటారు. మాంసం షాపులకు కూడా ఆదివారం ఫుల్ డిమాండ్ ఉంటుంది. అయితే ఇటీవల చికెన్, మటన్ ద్వారా విపరీతంగా పెరుగుతున్నాయి. న్యూ ఇయర్ రావడం, త్వరలో సంక్రాంతి పండుగ డిమాండ్ దృష్ట్యా చికెన్, మటన్ ధరలు పెరుగుతున్నాయి. వీటితో పాటు గుడ్ల ధరలు కూడా పెరుగుతుండటంతో సామాన్యుల జేబులు ఖాళీ అవుతున్నాయి.
రూ.550 మటన్
బయట మటన్ కొనాలంటే కేజీ రూ.800 నుంచి రూ.900 వరకు ఉంటుంది. కానీ హైదరాబాద్‌లోని అంబర్‌పేట గోల్నాక కబేలాలో కేవలం రూ.550కే కిలో మటన్ ఇస్తున్నారు. ధర తక్కువ కదా అని నాణ్యత లేని మటన్ అనుకోవద్దు. అత్యంత క్వాలిటీ గల మటన్‌నే ఇక్కడ విక్రయిస్తున్నారు. ఇక మటన్‌నే కాకుండా బోటీ సెట్ రూ.300కు, మేక తలకాయ రూ.400కే ఇస్తున్నారు. బయట షాపులతో పోలిస్తే ఇక్కడ మటన్ ధరలు తక్కువగా ఉండటంతో కొనుగోలు చేసేందుకు కస్టమర్లు బారులు తీస్తున్నారు. అసలే ఆదివారం కావడంతో మార్కెట్ జనాలతో సందడిగా మారింది. బయటి ధరలతో పోలిస్తే రూ.300 తక్కువ పడటంతో మటన్ ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. బల్క్‌గా విక్రయాలు జరపడం వల్ల తాము ఇక్కడ మటన్ తక్కువ అందించడం జరుగుతుందని ఇక్కడి వ్యాపారులు చెబుతున్నారు.
చికెన్ ధరల షాక్
ఇక చికెన్ ధరల షాక్ సామాన్యులకు తప్పడం లేదు. హైదరాబాద్‌లో చికెన్ ధరలు కొండెక్కాయి. కేజీ స్కిన్ లెస్ ధర రూ.310 పలుకుతోంది. ఇక విజయవాడ, గుంటూరు, వరంగల్‌లో కూడా రూ.300గా ఉంది. ఇక కోడి గుడ్డు ధర రూ.8గా ఉంది. శీతాకాలంలో కోళ్ల ఉత్పత్తి తగ్గడం, దాణా ఖర్చులు పెరగడం, త్వరలో సంక్రాంతి పండుగ ఉండటంతో వివిధ ప్రాంతాలకు సరఫరా పెరగడంతో చికెన్ ధరలు పెరుగుతున్నాయి. మరో నెలల రోజుల పాటు ఇలాగే ధరలు కొనసాగే అవకాశముందని, ఆ తర్వాత తగ్గొచ్చని చికెన్ షాపుల యజమానులు చెబుతున్నారు. ధరలు పెరిగినా చికెన్ విక్రయాలు మాత్రం తగ్గడం లేదు. ఆదివారం కావడంతో కొనేందుకు ఎగబడుతున్నారు. అయితే సామాన్యులకు అందుబాటులో ఉండే చికెన్, గుడ్ల ధరలు పెరగడంతో ఇంటి ఖర్చు కోసం ఎక్కువగా వెచ్చించాల్సి వస్తుంది. పండగ తర్వాత కాస్త ధరలు శాంతించే అవకాశముందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
