అరుణోదయ రామారావు హఠాన్మరణం

హైదరాబాద్‌: అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఏపీ అధ్యక్షుడు అరుణోదయ రామారావు మృతి చెందారు. ఇవాళ ఉదయం గుండెపోటు రావడంతో ఆయన బంధువులు హైదరాబాద్‌లోని దుర్గాబాయి దేశ్ ముఖ్ ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్నం మరోసారి స్ట్రోక్ రావడంతో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కర్నూలు జిల్లా ఆదోని గ్రామానికి చెందిన ఆయన..40 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లోని వామపక్ష ఉద్యమాల్లో క్రియాశీలపాత్ర పోషించారు. రామారావు భౌతికకాయాన్ని చూసేందుకు వామపక్షాల కార్యకర్తలు, ప్రజాసంఘాల నేతలు అధిక సంఖ్యలో […]

అరుణోదయ రామారావు హఠాన్మరణం
Follow us
Ram Naramaneni

|

Updated on: May 05, 2019 | 6:45 PM

హైదరాబాద్‌: అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఏపీ అధ్యక్షుడు అరుణోదయ రామారావు మృతి చెందారు. ఇవాళ ఉదయం గుండెపోటు రావడంతో ఆయన బంధువులు హైదరాబాద్‌లోని దుర్గాబాయి దేశ్ ముఖ్ ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్నం మరోసారి స్ట్రోక్ రావడంతో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కర్నూలు జిల్లా ఆదోని గ్రామానికి చెందిన ఆయన..40 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లోని వామపక్ష ఉద్యమాల్లో క్రియాశీలపాత్ర పోషించారు. రామారావు భౌతికకాయాన్ని చూసేందుకు వామపక్షాల కార్యకర్తలు, ప్రజాసంఘాల నేతలు అధిక సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ప్రజల సందర్శనార్థం రామారావు పార్థీవదేహాన్ని న్యూడెమోక్రసీ నేతలు విద్యానగర్‌లోని మార్క్స్ భవన్‌కు తరలించారు.