బ్యాలెట్ పత్రాలు తారుమారు..! గందరగోళంలో ఓటర్లు..

రంగారెడ్డి మొయినాబాద్ మండలం హజీజ్ నగర్‌లోని బూత్ నెంబర్ 111లో బ్యాలెట్ పత్రాలు తారుమారు కావడంతో పోలింగ్ నిలిచిపోయింది. ఒక గ్రామానికి చెందిన బ్యాలెట్ పత్రాలు మరో గ్రామానికి చేరడంతో గందరగోళం నెలకొంది. అంతేకాకుండా.. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం షేరిగూడెంలో కూడా పోలింగ్‌ ఆగిపోయింది. జనగామకు చెందిన బ్యాలెట్‌ పత్రాలు షేరిగూడెంకు వచ్చాయని అభ్యర్థులు ఆందోళనకు దిగారు. తెలంగాణలో తొలి విడత పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మూడు దశల పోలింగ్‌లో […]

బ్యాలెట్ పత్రాలు తారుమారు..! గందరగోళంలో ఓటర్లు..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 06, 2019 | 12:03 PM

రంగారెడ్డి మొయినాబాద్ మండలం హజీజ్ నగర్‌లోని బూత్ నెంబర్ 111లో బ్యాలెట్ పత్రాలు తారుమారు కావడంతో పోలింగ్ నిలిచిపోయింది. ఒక గ్రామానికి చెందిన బ్యాలెట్ పత్రాలు మరో గ్రామానికి చేరడంతో గందరగోళం నెలకొంది. అంతేకాకుండా.. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం షేరిగూడెంలో కూడా పోలింగ్‌ ఆగిపోయింది. జనగామకు చెందిన బ్యాలెట్‌ పత్రాలు షేరిగూడెంకు వచ్చాయని అభ్యర్థులు ఆందోళనకు దిగారు.

తెలంగాణలో తొలి విడత పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మూడు దశల పోలింగ్‌లో భాగంగా.. తొలిదశలో 2,097 ఎంపీటీసీలకు, 195 జడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది.